NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటారు వాహనాలకై దరఖాస్తులు ఆహ్వానం

1 min read

విభిన్న ప్రతిభవంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్బి.రామ్ కుమార్

 ఈనెల 25 లోగా గడువు

 కుటుంబ వార్షికాదాయం మూడు లక్షల మించి ఉండరాదు

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడుఏలూరు జిల్లాలో  విభిన్న ప్రతిభావంతులకు (శారీరక వైకల్యముకల వారు) మూడు చక్రముల మోటార్   వాహనాలకై ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్ కుమార్ ఒక ప్రకటనలు తెలిపారు.  అభ్యర్థులు తమ దరఖాస్తులను www.apdascac.ap.gov.in వెబ్సైటు లో దరఖాస్తు చేసుకొని, సదరు ఆన్లైన్ దరఖాస్తును అన్ని ధ్రువ పత్రములు నకళ్ళతో తమ కార్యాలయంనకు ఈనెల 25వ తేదీలోగా పంపాలన్నారు. దరఖాస్తు దారు 18 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని, 70 శాతం కన్నా ఎక్కువ శారీరక వైకల్యం కలిగి ఉండాలన్నారు. కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల రూపాయలకు మించి ఉండకూడదని, అభ్యర్థులు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, తమ పేరుపై ఏ మోటారు వాహనం కలిగి ఉండకూడదని,  ఏలూరు జిల్లాకు చెందినవారి ఉండాలన్నారు.  గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే పై స్థాయి కోర్సులు రెగ్యులర్ పద్ధతిలో చదువుచున్న విద్యార్థినీ, విద్యార్ధులు,  స్వయం ఉపాధి, వ్యవసాయం  & అనుబంధ రంగాలు లేదా కనీసం ఒక సంవత్సరం అనుభవం ఉన్న జీతం / వేతనం ఉద్యోగులు (కనీసం 10వ తరగతి విద్యార్హతతో) అర్హులన్నారు.    ధరఖాస్తుతోపాటు సదరం ధ్రువ పత్రము (జిల్లా మెడికల్ బోర్డు ద్వారా జారీ చేయబడ్డ ధ్రువ పత్రం) , ఆధార్ కార్డు, పదవ తరగతి మరియు ఆ పై విద్యార్హతలకు సంబందించిన ధృవీకరణ పత్రములు, షెడ్యూల్ కులముల / షెడ్యూల్ తెగలు వారైనచో కుల ద్రువీకరణ పత్రము, తాజా ఆదాయ ధ్రువ పత్రము, బోనఫైడ్ సర్టిఫికెట్ (విద్యార్ధుల కోసం) / ఉపాధి ధ్రువ పత్రము (స్వయం ఉపాధి లేదా ఉద్యోగుల కోసం.),  పాస్ పోర్ట్ సైజు ఫొటో (పూర్తిగా మనిషి కనపడుచూ) , ఇంతకూ ముందు వాహనము పొందలేదని స్వీయ ప్రకటన ఆన్లైన్ లో అప్లోడ్ చేసి, నకళ్లు ధరఖాస్తుతోపాటు సమర్పించాలన్నారు.

About Author