PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అంగన్​వాడీ, మినీ అంగన్​వాడి ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

1 min read

ఐసిడిఎస్ సిడిపిఓ వసంతబాయి

పల్లెవెలుగువెబ్​, రాయచోటి: రాయచోటి ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని సుండుపల్లె,సంబేపల్లి,చిన్నమండెం,రాయచోటి మండలాలలో ఖాళీగా ఉన్న అంగన్వాడి,మినీ అంగన్వాడీ,ఆయా పోస్టులకు డిసెంబర్ నెల 1 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని ఐసిడిఎస్ సిడిపిఓ వసంత బాయి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.ప్రాజెక్టు పరిధిలో 7 అంగన్వాడి పోస్టులు,2 మినీ అంగన్వాడి పోస్టులు,19 ఆయా పోస్తులు ఖాళీలు ఉన్నాయన్నారు.అందులో 7 అంగన్వాడి పోస్టులకు గాను సుండుపల్లె మండలంలో మిట్ట బడికి (ఎస్టీ) కంచిపాటివాండ్లపల్లి(బీసీ)కొండలతూర్పు(ఎస్సీ)సాయన్న గారిపల్లి(ఓసి)లుగా రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు.అలాగే సంబేపల్లె మండలంలో అగ్రహారం(ఓహెచ్) దేవపట్ల-1(ఓసీ) రాయచోటి మున్సిపాలిటీలోని చర్చి వీధి(ఎస్సీ)లకు కేటాయించారని చెప్పారు.అలాగే మినీ అంగన్వాడీ పోస్టులు గాను సుండుపల్లి మండలంలో టెక్కెం హరిజనవాడ(ఎస్సీ) రాయచోటి మండలంలో వడ్డి పల్లె(ఓహెచ్)లుగా రిజర్వేషన్ కల్పించారని తెలియజేశారు.అంతేగాక ఆయా పోస్టులకు గాను సుండుపల్లె మండలంలో ముడుంపాడు(బిసి.ఈ) ఎం.కురవపల్లె(బిసి.బి) చిన్న గొల్లపల్లె (బిసి.సి)దిగువ పల్లె (బిసి.సి) బిజీ రాచపల్లె(ఓసి)రాయవరం-1(ఓసి)పాపన్నగారిపల్లె(ఓహెచ్)సంబేపల్లె మండలంలో దేవపట్ల-2(బిసి.ఎ) కట్టుగుత్తపల్లె(బిసి.డి)శెట్టిపల్లె-1(ఎస్సీ)రాయచోటి మున్సిపాలిటీలో మేదర వీధి (బీసీ.ఈ) సుబ్బారెడ్డి వీధి(ఈడబ్ల్యూ ఎస్)పూజారి బండ(ఎస్టి) చిన్నమండెం మండలంలో కుమ్మరపల్లె(ఎస్టి) వై.జి.వి.పల్లె(బిసి.డి)జల్లావాండ్లపల్లి(ఓహెచ్)చాకిబండ-2(ఓహెచ్)రాయచోటి మండలంలో దిగువ అబ్బవరం(బిసి.డి) చెన్నముక్కపల్లె(ఎస్టి)లుగా రిజర్వేషన్లు కేటాయించినట్లు ఆమె తెలియజేశారు.కావున దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 1-7 -2021 సంవత్సరం నాటికి 21 సంవత్సరాలు పైబడి 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగి స్థానికులై వివాహితురాలై ఉండాలన్నారు.అలాగే అంగన్వాడీ,మినీ అంగన్వాడీ,ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు పదవ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలని సూచించారు.అంతేగాక ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు కేటాయించిన ప్రాంతాలలో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.అలాగే  పూర్తిచేసిన దరఖాస్తులను డిసెంబర్ నెల 1 వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా ఐసిడిఎస్ కార్యాలయంలో అందజేయాలన్నారు.

About Author