ప్రభుత్వ పథకాలు అందరికీ అమలవుతున్నాయా..
1 min read– అర్హత ఉండి పథకాలు అందని వారు ఉంటే అధికారులను, వాలంటీర్లను సంప్రదించండి..
– గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే అబ్బాయ చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : గుడివాకలంక గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కి ఆత్మీయ స్వాగతం ప్రజలు, వైయస్ఆర్సీపీ శ్రేణులు గుడివాకలంక గ్రామంలో గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గజమాలతో పూలమాలలతో శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఏలూరు రూరల్ మండలంలోని గుడివాకలంక గ్రామంలో జరిగిన దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం సంక్షేమ పథకాల గురించి ప్రజల నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు,గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెదపాడు మండలం గుడివాకలంక గ్రామంలోని ప్రతి గడపకు వెళ్లి జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి, చేస్తున్న అభివృద్ధి గురించి ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా అని ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకుని, అర్హత ఉండి పథకాలు అందని వారు ఉంటే, వారి వివరాలు సేకరించి పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు, వాలంటీర్లకు మరియు సచివాలయ సిబ్బందికి సూచించారు. గుడివాక లంకలో 59 మందికి నివాస స్థల పత్రాలు (ఎంజాయ్మెంట్ సర్టిఫికెట్) ఎమ్మెల్యే అందజేశారుఅలాగే గ్రామంలో ఉన్న ఇతర సమస్యల గురించి కూడా ప్రజలను అడిగి తెలుసుకుంటూ వాటిని పరిష్కరించారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, సొసైటీ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు మరియు సభ్యులు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.