అన్నమయ్య సేవలో సారధి గా వారధి గా
1 min read
అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా
కర్నూలు, న్యూస్ నేడు: ఆకట్టుకునే మాట తీరు, సమాజం పట్ల సామజిక భాద్యతలు, ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణలో మర్యాద మన్ననలతో పిల్లలను పెద్దలను పలకరించే నైజం, అపజయాలను అవకాశాలుగా మార్చుకునే ధైర్యం, చేపట్టిన కార్యక్రమం ఏదైనా ముందు ఉండి నడిపించే కార్యదీక్ష, అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సంకల్పం, ఒక్కసారి మాట్లాడితే ఔరా అనిపించే ఆధ్యాత్మిక ఒరవడి ఆమె సొంతం ఆవిడే మరెవరో కాదు అన్నమయ్య సేవలో గురువర్యులు అప్పగించిన భాద్యతను మేము సైతం అన్నమయ్య సేవకులం అనే నినాదం తో భాగ్యనగరములో శ్రీవారి సేవలో అన్నమయ్య సేవలను పరిచయం చేసిన ఎస్ వి ఏ ఎస్ టిగ (svast) అన్నమయ్య సేవ డైరెక్టర్ మీనాక్షి శ్రీనివాస్ తెలుగు ఉపాధ్యాయురాలిగా తొలి అడుగులతో తన వృత్తి ని ప్రారంభించి తెలుగు భాషపై మమకారాన్ని నుడికారం తో అందించి, అడ్మిన్ మేనేజర్ స్థాయితో ఒక వ్యవస్థలో భాద్యతయుతమైన కర్తవ్యాన్ని నిర్వహించి, ఉమెన్స్ ఎంపవర్మెంట్ లో తెలుగు రాష్ట్రాలలో సుమారు 800 మంది మహిళలను తమ శ్వసక్తితో ముoదుకు వెళ్లేలావారికి ఫ్యాషన్ డిజైనింగ్, పర్యావరణ పరిరక్షణ కి ఉపయోగపడేలా జ్యూట్ ప్రొడక్ట్స్ మేకింగ్ శిక్షణ తో చైతన్యాన్ని అందించి ,జీవితంలో ఒడిదుడుగులు ఎన్ని ఎదురు అయినా ఆత్మస్థర్యం తో ఎదురుకుని తన ముగ్గురు కుమార్తెలను తాము ఎంచుకున్న రంగాలలో స్థిరపరిచి, డివోషనల్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించి నేడు అన్నమయ్య సేవలో సారధిగా వారధిగా ఎందరో మహిళా కళాకారులకు ప్రోత్సహిస్తూ సనాతన హైందవ పరిరక్షణకు హిందూ సమాజానికి ఎనలేని సేవలు అందిస్తూ వీరు చేస్తున్న కృషి ఎందరికో ఆదర్శప్రాయము.