పత్రికా స్వేచ్ఛకు వేదింపులా…
1 min read
హొళగుందలో తహసీల్దారు కార్యాలయ సర్వేయర్ డీటీ ముకుందరావుకు వినతి పత్రం ఇస్తున్న ఏపీయూడబ్ల్యూజే నాయకులు.
న్యూస్ నేడు , హొళగుంద : హొళగుంద ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ లోపాలను ఎత్తి చూపే వారి పై కూటమి ప్రభుత్వం వేదింపులు, అక్రమ కేసులతో భయపెట్టడం సమంజనం కాదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (ఏపీడబ్ల్యూయూజే ) హొళగుంద మండల గౌరవధ్యక్షుడు బిఎం అమీర్సాబ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఆదేశాలతో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి ఇంట్లో పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండ సోదాలు నిర్వహించడం పట్ల గురువారం యూనియన్ మండలాధ్యక్షుడు చిన్నహ్యాట నాగరాజు ఆధ్వర్యంలో హొళగుంద తహసీల్దారు కార్యాలయం ముందు జర్నలిస్టుల నిరనన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమీర్భాషా. మాట్లాడుతూ వార్తల విషయంలో ఏమైనా అభ్యంతరాలుంటే న్యాయ వరంగా లేదా కౌన్సిల్ ఆఫ్ మీడియా దృష్టికి తీసుకెళ్లేలే తప్పా ప్రభుత్వం ఇలా వ్యక్తిగతంగ తీసుకుని కక్షలు తీర్చుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండ పోలీసులు దౌర్జన్యంగ ధనుంజయరెడ్డి ఇంట్లో ప్రవేశించి సోదాలు నిర్వహించి భయబ్రాంతులకు గురి చెయడం పత్రికా స్వేచ్ఛకు గొడ్డలి పెట్టన్నారు. ఎర్రమట్టి, అక్రమ సారా ఇలా ఏది వ్రాసినా సమాజంలో జరుగుతున్న మంచి, చెడును ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్య వరుస్తున్న విలేకరుల పై దాడులు ఆగడం లేదన్నారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించడానికి ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని, అదేవిధంగా జర్నలిస్టులు ఎదుర్కొరంట్ను సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం తాహసీల్దారు కార్యాలయ సర్వేయర్ డిటీ ముకుందరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో సభ్యులు నాగప్పు, విరుపాక్షి, ఈడిగ నాగరాజు, రవికాంత్, ముదున్సర్, మహేశ్ గౌడ్, అబుబకర్, తాహేర్ బాషా తదితరులు పాల్గొన్నారు.