అసెంబ్లీ సమావేశాలు.. 10 మందికి పాజిటివ్
1 min readపల్లెవెలుగువెబ్ : మహారాష్ట్రలో కరోన కేసులు తగ్గడంలేదు. వైరస్ తీవ్రత పెరుగుతోంది. మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పది మందికి కోవిడ్ నిర్ధారణ అవ్వడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర శీతాకాల అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానునున్నాయి. ఈ క్రమంలో సమావేశాలకు ముందు దాదాపు 3,500 మందికి ఆర్టీపీసీఆర్ ద్వారా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇందులో 10 మందికి పాజిటివ్‌గా తేలింది. కోవిడ్ సోకిన వారిలో ఎనిమిది మంది పోలీసులతోపాటు ఇద్దరు అసెంబ్లీ సిబ్బంది ఉన్నారు. అయితే ఏ జర్నలిస్ట్ గానీ, ఎమ్మెల్యేల గానీ కోవిడ్ బారిన పడలేదు. కాగా పది కరోనా కేసులు వెలుగుచూడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.