PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

దళిత కుటుంబంపై దాడి… దారుణం..!

1 min read
  • –దాడి చేసిన వారిని తక్షణం అరెస్టు చేయాలని ఓపిడిఆర్ నిర్ధారణ కమిటీ డిమాండ్

పల్లెవెలుగువెబ్​, అన్నమయ్య జిల్లా రాయచోటి:  రాయచోటి నియోజకవర్గంలో ని లక్కిరెడ్డిపల్లి మండలం మద్ది రేవుల గడ్డ కింద హరిజనవాడ కు చెందిన వట్టి కాళ్ల చంద్రయ్య అను దళిత కుటుంబం పై దాడి చేసి కుటుంబ సభ్యులను చావబాదిన వారిని తక్షణం అరెస్టు చేయాలని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పడిన నిజ నిర్ధారణ  కమిటీ డిమాండ్ చేశారు.గత నెల 14వ తేదీన వట్టి కాళ్ల చంద్రయ్య కు చెందిన గొల్ల దొడ్డి కి అడ్డంగా సురేంద్ర రెడ్డి ట్రాక్టర్ అడ్డంగా పెట్టిన సందర్భంలో వచ్చిన తగాదా విషయంలో దళిత కుటుంబం పై జరిగిన దాడి గురించి నిజ నిర్ధారణ కమిటీ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర సహాయ కార్యదర్శి టి. ఈశ్వర్ , అఖిలభారత న్యాయవాదుల సంఘం నాయకులు ఆనంద్ కుమార్,  రవిశంకర్,   వెంకటరమణ , కళ్యాణ్ కుమార్, బి ఎస్ పి జిల్లా అధ్యక్షులు యుగంధర్, రాయచోటి అధ్యక్షుడు నాగార్జున, జిల్లా నాయకులు  ఆంజనేయులు ఎమ్మార్పీఎస్ రెడ్డయ్య కలిసి శనివారం మద్ది రేవుల గడ్డ కింద హరిజనవాడ ను సందర్శించి బాధితులను పరామర్శించి జరిగిన సంఘటనపై వాస్తవాలను తెలుసుకొన్నారు. కట్ట కింద హరిజనవాడ కు చెందిన వట్టికాళ్ల చంద్రయ్య హరిజన వాడలోని  సర్వే నెంబర్  300/2బి  లో 20 సెంట్లు ఇంటి జాగ ఉన్నది.  లక్కిరెడ్డిపల్లి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి కి స్వయానా సోదరుడైన సురేంద్ర రెడ్డి కి హరిజనవాడ సమీపంలో ఎనిమిది ఎకరాల వరకు భూమి కలదు . ఇతని  భూమికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండే రెడ్డి వారి పల్లి నుండి సురేందర్ రెడ్డి ప్రతి నిత్యము భూమి దగ్గరికి రావడానికి నివాస గృహం దూరంగా ఉండడంతో , చంద్రయ్య 20 సెంట్ల జాగాను కబ్జా చేసి నివాస గృహం కట్టాలని నిర్ణయించుకున్నాడు .గత రెండు సంవత్సరాలుగా ఈ ప్రయత్నం జరుగుతూనే ఉందని నిజ నిర్ధారణ కమిటీ విచారణలో తేలింది. గత నెల 14న సాయంత్రం ఐదు గంటలకు సురేంద్ర రెడ్డి తన ట్రాక్టర్ ను చంద్రయ్య 20 సెంట్ల జాగాలో ఉన్న గొర్ల దొడ్డి కి అడ్డంగా నిలబెట్టాడు . ట్రాక్టర్ తమకు అడ్డంగా నిలబెట్టారని పక్కకు   తీయాలని చంద్రయ్య కుటుంబసభ్యులు వేడుకున్నప్పటికీ సురేంద్రరెడ్డి వినకుండా ఈ జాగా నాదేనంటూ ట్రాక్టర్ తీసే ప్రసక్తేలేదని చంద్రయ్య కుటుంబాన్ని బెదిరించాడు .ఇక్కడ ఇంటి నిర్మాణం చేస్తాను ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరించాడు . నన్నే ట్రాక్టర్ ను పక్కకు తీయ మంటావా అంటూ ఫోన్ లోనే నానా బూతులు తిట్టాడు బాధిత కుటుంబ సభ్యులను బెదిరించాడు. అంతటితో ఆగని సురేంద్ర రెడ్డి అదే రోజు అర్ధరాత్రి 50 మంది అనుచరులతో  చంద్రయ్య  కుటుంబసభ్యులపై దాడి చేశారు. ఈ దాడిలో ఉన్నత విద్యావంతుడైన చంద్రయ్య రెండవ కుమారుడు వట్టికాళ్ళ  నాగార్జున తల పైన బలమైన గాయం తగిలి సృహ తప్పి పడిపోయాడు .అడ్డు వచ్చిన అతని తల్లి పద్మావతి నీ అందరూ కలిసి చితక్కొట్టారు. అడ్డువచ్చిన వారిని కూడా చితక్కొట్టారు నాగార్జున సోదరుడైన బాలకృష్ణ పొలంలో నిద్రిస్తుండగా అతనిని కొట్టడానికి వెంటబడి 50మందితరుముతున్నారు .ప్రాణభీతితో అతను పరిగెత్తడం వలన  క్రిందపడి గాయాలయ్యాయి .ఉన్నత విద్యావంతుడైన నాగార్జున ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చేరి తలపై ఎనిమిది కుట్లు కూడా పడ్డాయి .ఒక దళిత కుటుంబం  తాను చెప్పినట్లు వినకుండా ఉన్నందుకే ఈ దాడి జరిగినట్లుగా  విచారణలో తేలిందని వారు తెలిపారు .దాడి చేసిన వారిలో  సురేంద్ర రెడ్డి హరినాథ్ రెడ్డి  సంజీవరెడ్డి  శివయ్య అంజి సందీప్ శివ శంకర్ నాయుడు డు పాలెం జగన్ మరికొంత మంది ఉన్నప్పటికీ పోలీసులు కేసు మాత్రం నమోదు చేసి చేతులు దులుపుకున్నారు వారిని  ఇంతవరకు వారిని అరెస్టు చేయడం లేదు. దాడి చేసినవారు మళ్లీ బాధిత కుటుంబం చుట్టూ తిరుగుతూ బెదిరింపులకు గురి చేస్తూ కేసు వెనక్కి తీసుకోవాలని లేకుంటే చంపేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నప్పటికీ పోలీసులు మాత్రం వారిని అరెస్టు చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు ఇప్పటికైనా పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేయడంతోపాటు తక్షణ వారిని అరెస్టు చెయ్యని పక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టవలసిన వస్తుందని నిజ నిర్ధారణ కమిటీ నాయకులు హెచ్చరించారు.

About Author