అర్చకుడి పై దాడి హేయమైన చర్య
1 min read
మహానంది, న్యూస్ నేడు: కొలనుభారతి క్షేత్రం అర్చకుడి పై దాడిచేసి గాయ పరచడం హేయమైన చర్య అని మహానంది క్షేత్రం అర్చక సంగం,మహానంది దేవస్థానం ప్రధాన అర్చకులు అర్జున్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు జనార్దన్ శర్మ, శంకరయ్య శర్మ, సుబ్బయ్య శర్మ, ప్రకాశం శర్మ,రతయ్య బాబు, రాజు స్వామి, హారహరి శర్మ, మణికంఠ శర్మ,సురేంద్ర శర్మలు తెలిపారు. మంగళవారం వారు మాట్లాడుతూ ఆలయంలో పూజలు నిర్వహించే అర్చకునిపై అక్కడే తాత్కాలికంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి దాడి చేయడం మంచిది కాదన్నారు. దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసునమోదు చేసి, విదులనుండి తప్పించాలని డిమాండ్ చేశారు.