నాటు సారా స్థావరాలపై దాడులు…
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ కర్నూలు పరిధిలో ఓర్వకల్లు మండలం గుడుంబాయి తండాలో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించడం జరిగినది.ఈ దాడులలో సుమారు 16 లీటర్ల నాటు సారాకు తయారీకి పనికి వచ్చు బెల్లం ఊటను ధ్వంసం చేయడం జరిగినది.తదుపరి 45 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకోవడం జరిగినది. ఈ దాడులలో అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కర్నూలు రాజశేఖర్ గౌడ్ మరియు ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్స్పెక్టర్ చంద్రహాస్ వారి వారి సిబ్బందితో ఈ దాడులు నిర్వహించడమైనది తదుపరి గ్రామస్తులను ఉద్దేశించి నాటు సారా అమ్మడం కానీ తయారు చేయడం కానీ రవాణా చేయడం కానీ చట్టరీత్యా నేరము అని తెలుపుతూ ఈ దాడులలో గుర్తించినటువంటి వ్యక్తుల జాబితాను వివరించి వీరందరినీ త్వరలో అరెస్టు చేస్తామని దానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తూ ఇకమీదట నాటుసారా తయారు చేయడం అనేది పూర్తిగా మానివేయాలని లేనిచో చట్టాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ పీడీ యాక్ట్ ను ప్రయోగించుటకు కూడా ఎటువంటి సందేహము ఉండదని తెలియజేస్తూ నాటు సారా లేని గ్రామంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేయుచున్న కృషికి అందరూ సహకరించాలని తెలియజేయడమైనది. దర్యాప్తులో ఈ క్రింది వారు నాటు సారా తయారు చేయువారిగా తెలియడం వలన వీరందరి పై కేసు నమోదు చేయడం జరిగినది.
1) మాధవత్ దన్ను నాయక్ తండ్రి రాముడు నాయక్ @ మోటో నాయక్2) నానవత్ రాజునాయక్ తండ్రి నాగ్యా నాయక్ , 3)మాధవత్ మద్ధిలేటి నాయక్ పొట్ల నాయక్, 4) నానవత్ రమేష్ నాయక్, తండ్రి రామోజీ నాయక్ పై వారి పై కేసు నమోదు చేయడమైనది వీరినిత్వరలో అరెస్టు చేయడం జరుగుతుంది ఏ పై వారు కాకుండా మరికొంత మంది కూడా వున్నారు వారిపై కూడా చర్యలు తీసుకోవడమౌతుంది.