రితం డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను ప్రారంభించిన టీజీ వెంకటేష్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: నగరంలోని ప్రకాష్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రితం డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియోను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వైద్యులు డాక్టర్ కన్నా, వీరేంద్ర, స్టూడియో నిర్వాహకులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ కర్నూల్ నగరంలో రితం డాన్స్ అండ్ ఫిట్నెస్ స్టూడియో ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారా మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే అవకాశం ఉందని వివరించారు .డ్యాన్స్ మరియు ఫిట్నెస్ లలో సాధన చేయడం వల్ల శరీరానికి తగిన వ్యాయామం లభించడంతో పాటు ఐక్యూ పెరుగుతుందని వివరించారు .సంస్థ నిర్వాహకులకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.

