PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో కొన‌సాగుతున్న థియేట‌ర్ల పై దాడులు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీ వ్యాప్తంగా థియేట‌ర్ల పై దాడులు కొన‌సాగుతున్నాయి. నిబంధ‌న‌లు పాటించ‌ని థియేట‌ర్ల పై అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. వారంరో్జులుగా ఏపీ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో త‌నిఖీలు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. గురువారం కూడా అన్ని జిల్లాల్లో అధికారులు సినిమా హాళ్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 14 హాళ్లను సీజ్‌ చేశారు. గురువారం కృష్ణా జిల్లా వ్యాప్తంగా అధికారులు థియేటర్లను తనిఖీచేశారు. ఎలాంటి లైసెన్సు, అనుమతులు లేకుండా నడుపుతున్న 11 థియేటర్లను సీజ్‌చేశారు. నిబంధనలు పాటించడం లేదనే కారణంతో విజయవాడ సెంట్రల్‌ నియోజకవర్గంలోని శైలజ థియేటర్‌కు రూ.20 వేలు జరిమానా విధించారు. విశాఖపట్నం జిల్లాలో 110 సినిమా థియేటర్లు ఉండగా.. గురువారం నాటికి 70 థియేటర్ల తనిఖీని అధికారులు పూర్తిచేశారు.

                

About Author