NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు, విద్యార్ధులు  అప్రమత్తంగా ఉండాలి..

1 min read

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్

జిల్లా ఎస్పీ  ఆదేశాలతో ” నేను సైబర్ స్మార్ట్ కార్యక్రమం”  పై  ముమ్మరంగా అవగాహన కార్యక్రమాలు.

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా ఎస్పీ   నూతనంగా శ్రీకారం చుట్టిన  “ నేను సైబర్  స్మార్ట్ “ కార్యక్రమం   పై వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో   పోలీసు అధికారులు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యా సంస్థలు, పాఠశాలలు, కళాశాలలో, పట్టణాలు, గ్రామాలలో అవగాహన కల్పిస్తున్నారని కర్నూలు  జిల్లా  ఎస్పీ   విక్రాంత్ పాటిల్ ఐపియస్    శుక్ర వారం తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకూడదని కరపత్రాలు, లఘు చిత్రాలతో  వివిధ కళాశాలలు, పాఠశాలలు , పట్టణాలు,  గ్రామాలలో ప్రజలకు, విద్యార్ధులకు  పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. డిజిటల్ అరెస్టు, జాబ్ ఫ్రాడ్స్ , కెవైసి మరియు ఓటిపి మోసాలు,  పెట్టుబడి మోసాలు , కోరియర్ ఫ్రాడ్స్,  ఆధార్ కార్డు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు బ్లాక్ అయిందని, లింకు వస్తుంది క్లిక్ చేయాలని, ఇన్వెస్ట్ మెంట్స్ ప్రాడ్స్ ,  తెలియని వ్యక్తులకు షేర్ చేయవద్దని , తెలియని లింకుల పై క్లిక్ చేయరాదని తెలియజేస్తున్నారు. కర్నూలు , ఆదోని, పత్తికొండ, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ ల పరిధులలోని జిల్లా వ్యాప్తంగా ఉన్న  38 పోలీసు స్టేషన్  పరిధులలో ఇప్పటివరకు   485   ”  నేను  సైబర్ స్మార్ట్ ” అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ అవగాహన  కార్యక్రమాలలో 48,600 మంది కి  సైబర్ నేరాల బారిన పడకూడదని  అవగాహన కల్పించారు.సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే గంటలోపే  సైబర్ క్రైం హెల్ప్ లైన్  నెంబర్ 1930  కి  ఫిర్యాదు చేస్తే  తప్పక న్యాయం జరుగుతుందన్నారు. సైబర్ క్రైమ్  పోర్టల్ cybercrime.gov.in లో బాధితుల వివరాలు నమోదు చేయాలన్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ పోలీసు అధికారులను సంప్రదించి సైబర్ నేరం జరిగిన  వివరాలను తెలియజేయాలని అవగాహన కల్పిస్తున్నారు.

About Author