వరిలో పంట మార్పిడి గురించి రైతులకు అవగాహన
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని ఓబులంపల్లి గ్రామంలో వరిలో పంట మార్పిడి గురించి అనాదిగా సాగు చేస్తున్న రెండు మూడు పంటలు సాగు చేస్తున్న రైతులు అలాగే ఇతర ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని రైతులకు కెవికె ప్రధాన శాస్త్రవేత్త రామ్మూర్తి అన్నారు, ఈ సందర్భంగా ఆయన ఓబులంపల్లెలో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై, అవగాహన అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు, ఈ ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల పై దృష్టి సారించాలని ఆయన తెలిపారు, దీనికి సంబంధించి ఉపకరణాల పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన రైతులకు తెలియజేశారు,కడప జిల్లాలో రెండు మూడు సీజన్లలో పండిస్తున్న వరి పంటలో లాభాల బాట లేకపోవడం వలన అలాగే నేల స్వభావం దెబ్బ తినడం వలన నీటి కొరత ఏర్పడడం వలన రైతులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు అనగా పప్పు ధాన్యాలు ,నూనె పంటలు వంటివి సాగు చేయడం వలన అధిక దిగుబడిని సాధించవచ్చునని ఆయన రైతులకు తెలియజేశారు,వరికి బదులుగా వైవిధ్యకరమైన పంటల సాగు అనే ప్రాజెక్ట్ ద్వారా రైతులకు వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలియజేశారు, అని కెవికెల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటామని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కే సాయి మహేశ్వరి, మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి ఇందిర విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ రైతులు పాల్గొన్నారు.