ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన
1 min read
అవగాహన కల్పించి కర్నూలు ట్రాఫిక్ సీఐ మన్సురుద్దీన్.
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ ఆదేశాల మేరకు కర్నూలు డిఎస్పీ జె.బాబుప్రసాద్ పర్యవేక్షణలో కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్ , తన సిబ్బందితో కలిసి గురువారం కర్నూలు కోత్తపేట దగ్గర ఉన్న ట్రాఫిక్ పోలీసుస్టేషన్ లో 50 మంది ఆటో డ్రైవర్లకు రహాదారి భద్రత నిబంధనల పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కు విడియోలు చూయించారు. ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ చేశారు.రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. ఆటో డ్రైవర్ లు డ్రైవింగ్ లెసెన్సులు , ఆటోలు నడిపేటప్పుడు ఆటోల రికార్డ్సులు తప్పక కలిగి ఉండాలని తెలిపారు.ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి మోటారు వాహనాల చట్టం ప్రకారం జరిమానాలు విధించారు.