NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

“సైబర్ నేరాల పై అవగాహన సదస్సు “

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు:  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో  స్థానిక  దుపాడు నందుగల అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీ నందు    సైబర్ క్రైమ్స్ పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి హాజరయ్యారు.  జడ్జి మాట్లాడతూ  సమాజంలో  ఆన్ లైన్ లలో  అనేక రకాలుగా సైబర్ నేరాలు  జరుగు చున్నాయని తెలిపారు. వాటిని ఎలా ఎదుర్కొని తమను తాము ఎలా రక్షించు కోవాలో  వివరించారు. ఐసిఐసిఐ బ్యాంక్ రీజినల్ హెడ్ విశాల్  మనీ సంబంధిత ఆన్లైన్ మోసాల గురించి  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా   స్టూడెంట్స్ కు వివరించారు. బ్యాంకులు ఎప్పుడు ఫోన్ చేసి ఏటీఎం కార్డు పిన్ నెంబర్ మరియు ఓటీపీలను అడగవని చెప్పారు. అనుమానాస్పద  లింకులని డౌన్లోడ్ చేసుకోవద్దని తెలిపారు. కర్నూలు సైబర్ క్రైమ్ సీఐ ప్రవీణ్ కుమార్ ఆన్లైన్లో జరిగే మోసాల ను గురించి వాటిని ఎలా ఎదుర్కోవాలి అని వివరించారు. ఏదైనా సైబర్ నేరం జరిగినప్పుడు  వెంటనే  సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి కంప్లైంట్ చేయాలని తెలిపారు. నేరం జరిగిన వెంటనే కంప్లైంట్ చేస్తే మనీ రికవరీ ఎక్కువ అవకాశం ఉంటుందని తెలిపారు. డిజిటల్ అరెస్టు మొదలైన వాటిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్  ద్వారా స్టూడెంట్స్ కు  వివరించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారు సైబర్ క్రైమ్స్ పై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన స్టూడెంట్స్ కు కర్నూలు లయన్స్ క్లబ్ ఆఫ్ మెల్విన్ జోన్స్ సంస్థ ప్రతినిధి  డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ సహకారంతో జడ్జి  చేతుల మీదుగా స్టూడెంట్ లకు సర్టిఫికెట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో అశోక మహిళా ఇంజనీరింగ్ కాలేజి హెడ్ అఫ్ డిపార్ట్మెంట్ జావీద్, లీగల్ ఎయిడ్ మెంబర్ డాక్టర్ రాయపాటి శ్రీనివాస్, సైబర్ క్రైమ్ సీఐ ప్రవీణ్ కుమార్, ఐసిఐసిఐ బ్యాంక్ రీజనల్ హెడ్ విశాల్,చీఫ్ మేనేజర్  రవిశంకర్,  బ్రాంచ్ మేనేజర్ మహమ్మద్ గౌస్,డిప్యూటీ మేనేజర్ జయరాం, లెక్చరర్లు,కళాశాల విద్యార్థినులు  మొదలగు వారు పాల్గొన్నారు.

About Author