ఆశ వర్కర్స్ కు ఈ శ్రమ్ కార్డులపై అవగాహన సదస్సు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశానుసారంగా, అధ్యక్షులు మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూలు జి. కబర్థి వారి సూచనల మేరకు, శ్రీ బి. లీలా వెంకట శేషాద్రి,కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, కర్నూలు వారు శాశ్వత లోక్ అదాలత్ అధ్యక్షులు శ్రీ వెంకట హరినాధ్ సోమవారం నాడు న్యాయ సేవా సదన్ నందు ఆశ వర్కర్స్ కు ఈ శ్రమ్ కార్డులపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం వారోత్సవాల్లో భాగంగా వివిధ రంగాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ శ్రామ్ కార్డులు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ శ్రామ్ కార్డుల వల్ల లభించే ఉపయోగాలను మీకు తెలిసిన కార్మికులకు తెలియజేసి వారు ఈ శ్రామ్ కార్డులు పొందేలా కృషి చేయాలని కోరారు.జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ శాంతి కళ మాట్టాడుతూ తమ డిపార్ట్మెంట్ లోని అందరు ఆశ వర్కర్స్ ఈ శ్రామ్ కార్డ్స్ పొందారని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ ఆశ వర్కర్స్ కు ఈ శ్రామ్ కార్డులు ఈ శ్రామ్ పోర్టర్ లో ఎలా నమోదు చేయాలో వివరించారు. ఈ కార్డులు పొందిన వారికి ప్రభుత్వం అందించే అన్ని రకాల సామాజిక భద్రతా పధకాలు వివిధ సంక్షేమ పథకాలు వర్తింపజేయడం జరుగుతుందని తెలిపారు. మరియు ప్రతి ఒక్క కార్మికునికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రెండు లక్షల ప్రమాద మరణ బీమా ఉచితంగా కల్పించడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో హెల్త్ డిపార్ట్మెంట్ లీగల్ ఆఫీసర్ సుమలత తదితరులు పాల్గొన్నారు.