బాహుబలి ఆ సినిమా కథలా ఉంటుంది !
1 min readపల్లెవెలుగువెబ్ : బాలీవుడ్ లో దక్షిణాది సినిమాలు బాక్సాఫీస్ కలెక్షన్స్ సాధించడం పై ప్రముఖ దర్శకుడు రాకేష్ రోషన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇప్పటికీ జనాల జీవితాలను చూపించే కథలకు దక్షిణాది దర్శకులు, నిర్మాతలు కట్టుబడి ఉన్నారు. కమర్షియల్ సెన్సిబిలిటీలను దృష్టిలో ఉంచుకుని చాలా అప్‌గ్రేడ్‌గా ప్రదర్శిస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్, బాహుబలి లాంటి సినిమాలు చూస్తే అలాంటి కథే ఉంటుంది. బాహుబలి కరణ్ అర్జున్‌ని పోలి ఉంటుంది. కానీ దాన్ని భారీ స్థాయిలో తెరకెక్కించారు. పాటలను కూడా భారీ స్థాయి చూపించారు. అందువల్ల ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరించారు. కానీ.. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భారతీయత మూలాలకు దూరమయ్యారు. ఆధునిక సినిమా పేరుతో చెత్తని తెరమీదకి తెస్తున్నారు. అది కేవలం ఒక శాతం జనాభాకి మాత్రమే నచ్చుతుంది. ఆ సినిమాలు బి, సి సెంటర్ల ప్రేక్షకులకి అంతగా ఎక్కడం లేదు. కాబట్టి వాటికి అనుగుణంగా కథని ఎంచుకుని తీస్తే కచ్చితంగా ఆదరిస్తారు’ అపి తెలిపాడు.