PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

షార్ట్ సర్క్యూట్ తో బేకరీ షాపు దగ్ధం

1 min read

రూ: 30 లక్షలు ఆస్తి నష్టం.. ప్రభుత్వం ఆదుకోవాలని బాతుడి వేడుకలు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : చెన్నూరు కొత్త రోడ్డు జాతీయ రహదారిపై శనివారం శనివారం ఉన్న జరిగిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో బేకరీ షాప్ పూర్తిగా దగ్ధం అయింది, దీంతో షాపు యజమాని అయిన గుద్దేటి తిరుపతయ్య( లడ్డు బాబు) కు రూ: 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు, బాధితుని కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి, తిరుపతయ్య( లడ్డు బాబు) అనే వ్యక్తి ఆరు సంవత్సరాల నుండి బేకరి షాపు నిర్వహించుకుంటూ జీవనం సాగిస్తున్నారు, అయితే రోజు లాగా శుక్రవారం రాత్రి 9 గంటలకు షాపు మూసేసి ఇంటికి వెళ్లిన తిరుపతయ్యకు  శనివారం తెల్లవారుజామున 12 గంటల సమయంలో తమ షాపు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయని తెలియడంతో కుటుంబం అంతా కూడా షాపు వద్దకు రావడం జరిగింది అన్నారు, అయితే అప్పటికే బేకరి షాప్ అంతా కూడా తగలబడి పోయిందని , అందులోని యంత్ర సామాగ్రి తో పాటు, భూమి పాస్ పుస్తకాలు, అలాగే డాక్యుమెంట్లు, పలు సర్టిఫికెట్లు, స్వీట్స్ అందుకు ఉపయోగించే సామాగ్రి కూడా పూర్తిగా కాలిపోయిందని బాధితుడు తెలిపారు, కాగా ఈ విషయమై అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో వారు వచ్చి, మంటలను ఆర్పి వేయడం జరిగిందన్నారు, అంతేకాకుండా తిరుపతయ్య నలుగురు కుమార్తెలలో ఒక కుమార్తెకు వివాహం కొరకు బంగారు కొనుగోలు వరకు తెచ్చుకున్న 10 లక్షల రూపాయలు కూడా కాలి బూడిద అయినట్లు బాధితుడు వాపోయాడు, సోమవారం బంగారు కొనుగోలు చేద్దాం అనుకోనే లోపల ఈ దుర్ఘటన సంభవించిందని బాధిత కుటుంబo బోరున విపించింది, తిరుపతయ్య కుటుంబానికి గతంలో ఓ వివాహ సందర్భంగా జరిగిన యాక్సిడెంట్లో సర్వస్వం కోల్పోగా, మళ్లీ ఇప్పుడు బ్రతుకుతెరువు కొరకు అప్పులు చేసి పెట్టుకున్న బేకరీ షాపు దగ్ధం కావడంతో ఆ  కుటుంబం మరింత పోవడం జరిగింది, అలాగే ఈ బేకరీ షాపు పక్కన ఉన్న ఓబులేసు అనే వ్యక్తికి చెందిన కూల్ డ్రింక్ షాప్ లో కూడా మంటలు వ్యాపించి లక్ష రూపాయలు వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఓబులేసు తెలిపారు. పరిశీలించిన ఎంపీపీ చీర్లసురేష్ యాదవ్ రెవిన్యూ అధికారులు తిరుపతయ్య( లడ్డు బాబు) బేకరీ షాపు షార్ట్ సర్క్యూట్ అయిన విషయాన్ని తెలుసుకున్న ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్ శనివారం ఉదయం షార్ట్ సర్క్యూట్ అయిన తిరుపతయ్య షాపును పరిశీలించారు, ఎలా జరిగింది అనే విషయాలను తిరుపతయ్యను అడిగి తెలుసుకున్నారు, అనంతరం తిరుపతయ్యకు పూర్తిగా అండదండలుగా నిలబడతామని ప్రభుత్వం ద్వారా అతనికి సహాయ సహకారాలు అందిస్తామని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామని బాధితునికి ఎంపీపీ హామీ ఇవ్వడం జరిగింది, అలాగే రెవిన్యూ అధికారులు కాలిపోయిన షాపులను పరిశీలించి ఏ ఏ సామాగ్రి ఎంతెంత ఖర్చు అవుతుందో అన్ని వివరాలు బాధితుని వద్ద తీసుకోవడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఆర్ ఐ, వీఆర్వో, వీఆర్ఏ తదితరులు పాల్గొన్నారు.

About Author