బాలాజీ ఐటిఐ కళాశాల గుర్తింపును రద్దు చేయాలి
1 min readఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సురేష్.
పల్లెవెలుగు వెబ్ గడివేముల: గడివేముల మండలంలోని శ్రీ బాలాజీ ఐటిఐ కళాశాల డబ్బు కొట్టు సర్టిఫికెట్ పట్టు అనే విధంగా వ్యవహరిస్తూ కేవలం ఎలక్ట్రిషన్ సర్టిఫికెట్లు ఇచ్చే కేంద్రంగా మారిందని ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సురేష్ తెలిపారు. శుక్రవారం నాడుస్థానిక గడివేముల మండలంలోని ఆ కళాశాలలో సందర్శించి సమావేశం నిర్వహించారు.కళాశాలలో ఎలక్ట్రిషన్ కోర్సు మాత్రమే నడుస్తుందని ఆ కోర్సులో సంవత్సరానికి సంబంధించి 80 మంది విద్యార్థులు ఉంటే ఒక్కరు కూడా కళాశాలకు రాని పరిస్థితి ఉందని కళాశాలకు రాని విద్యార్థులకు ఒక్కొక్కరికి 25వేల రూపాయల ఫీజు కట్టించుకుని వారిని పబ్లిక్ ఎగ్జామ్ కి మాత్రమే హాజరైనట్లు చేసి సర్టిఫికెట్లు ఇస్తున్నారని విద్యార్థులకు ఎలక్ట్రిషన్ కోర్సులు నైపుణ్యతను నేర్పించకుండా ..కేవలం సర్టిఫికెట్ ఇచ్చే పద్ధతిని మార్చుకోవాలన్నారు.అలాగే ఇలాంటి కళాశాలపై జిల్లా ఐటిఐ కళాశాలలో కన్వీనర్ తక్షణమే చర్యలు తీసుకుని ఈ కళాశాల గుర్తింపు రద్దుచేసి యజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని లేనిపక్షంలో విద్యార్థులను కలుపుకొని నంద్యాల జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి కళాశాల గుర్తింపును రద్దు చేసేంతవరకు ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు*ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దినేష్ కుమార్ మండల నాయకులు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.