PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆస్పత్రిలో చేరిన బాల‌కృష్ణ !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ అగ్రహీరో నందమూరి బాల‌కృష్ణ ఆస్పత్రిలో చేరారు. గ‌త ఆరు నెల‌లుగా బాల‌కృష్ణ భుజం నొప్పితో బాధ‌ప‌డుతున్న నేప‌థ్యంలో చికిత్స నిమిత్తం బంజారా హిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ ర‌ఘువీర్ రెడ్డి, డాక్టర్ బీఎన్ ప్రసాద్ ల బృందం తీవ్రంగా శ్రమించి బాల‌కృష్ణకు శ‌స్త్రచికిత్స పూర్తీ చేసింది. ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉండ‌టంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేశారు. ప్రస్తుతం ఆయ‌న న‌టించిన అఖండ సినిమా షూటింగ్ పూర్తీ అయింది. త్వర‌లో విడుద‌ల తేదీ ప్రక‌టించ‌నున్నారు.

About Author