21 వేలు దాటిన ఈటల ఆధిక్యం !
1 min read

పల్లెవెలుగు వెబ్: హుజురాబాద్ ఉపఎన్నికలో ఈటల రాజేందర్ భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నారు. 20వ రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటివరకూ 20వ రౌండ్లో ఈటల రాజేందర్ మూడు వేలకు పైగా ఓట్లు సాధించారు. ఇంకా కౌంటింగ్ ప్రక్రియ సాగుతోంది. మొత్తంగా ఈటల రాజేందర్ 21, 015 ఓట్ల మెజార్టీతో ముందంజలో కొనసాగుతున్నారు. ఈటల గెలుపు ఖాయం అవ్వడంతో బీజేపీ శ్రేణులు విజయోత్సాహంతో ఉన్నారు. హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా ఈటల గెలుపును ఆపలేకపోయారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.

