మాజీ మంత్రి ఎస్వి సుబ్బారెడ్డిని కలిసిన బీసీ. జనార్దన్ రెడ్డి
1 min read
పల్లెవెలుగు, పత్తికొండ: మాజీ మంత్రివర్యులు ఎస్సీ సుబ్బారెడ్డిని ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి మంగళవారం నాడు కలుసుకున్నారు. ఎస్.వి సబ్బారెడ్డి కూతురు ఎస్ నాగరత్నమ్మ అల్లుడు ఎస్ రామచంద్ర రెడ్డి స్వగృహంలో వయస్సు రీత్యా విశ్రాంతి తీసుకుంటున్న మాజీ మంత్రివర్యులు ఎస్పీ సుబ్బారెడ్డిని ప్రస్తుత రాష్ట్ర మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి తో పాటు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ బత్తిని వెంకటరాముడు, టిడిపి జిల్లా ఇన్చార్జి తిక్కా రెడ్డి, శాలివాహన ఫెడరేషన్ మాజీ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర, తిమ్మప్ప చౌదరి , తదితరులు ఆయనను కలుసుకొని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.