జగన్ వల్ల పులివెందులకు చెడ్డపేరు
1 min read

పల్లెవెలుగువెబ్ : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీరుతో ఆయనను ఎన్నుకున్న పులివెందులకు కూడా చెడ్డ పేరు వస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు. జగన్ తన పాలనా తీరు, విద్వేష రాజకీయాల కారణంగా తనను ఎన్నుకున్న పులివెందులకూ చెడ్డపేరు తెస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తన రివర్స్ పాలనతో సొంత నియోజకవర్గ ప్రజల నుంచి కూడా జగన్ వ్యతిరేకత తెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు.

