అర్జీల పరిష్కారంలో సంతృప్తి వ్యక్తం చేసిన లబ్దిదారులు..
1 min read– అర్జీదారులకు ల్యాప్ టాప్ , టచ్ ఫోన్ అందజేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్నవెంకటేష్…
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : స్పందన-జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో తెలుపుకున్న తమ సమస్యలు పరిష్కారం కావడం పట్ల పలువురు అర్జీదారులు సంతోషం వ్యక్తంచేస్తూ జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. సంతృప్తికరంగా తమ సమస్య పరిష్కారమైయిందని పలువురు లబ్దిదారులు తెలియజేస్తూ సంబంధిత పత్రాలను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చేతులమీదుగా అందుకున్నారు. ఇటువంటి సంతృప్తి కరంగా పరిష్కారమైన అర్జీల్లో కొన్నింటిని ఆయా మండలాల నుంచి తెలుసుకొనే నూతన ఒరవడికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శ్రీకారం చుట్టారు. ఇందులో బాగంగా సోమవారం కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో ఆయా లబ్దిదారులు, ధరఖాస్తు చేసిన వాటికి సంబంధించి పత్రాలను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ వారికి అందజేశారు. ఇందుకు సంబంధించి సంతృప్తికర స్ధాయిలో పరిష్కారమైన అర్జీలకు సంబందించి సోమవారం కైకలూరు మండలానికి చెందిన బదిరుడైన కెఎన్ వి అనీల్ కుమార్ కు టచ్ ఫోన్ ను, జంగారెడ్డిగూడెం కు చెందిన మరో బదిరియైన గొంటిరెడ్డి జ్వోతికి ల్యాప్ టాప్ ను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అందజేశారు. ఈ సందర్బంగా కెఎన్ వి అనీల్ కుమార్, గొంటిరెడ్డి జ్యోతి, జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కు తమ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చింతలపూడి మండలానికి చెందిన కుక్కపల్లి సీతారామయ్య తమభూమి మ్యూటేషన్ కోసం ధరఖాస్తు చేయగా చింతలపూడి తహశీల్దారు సంబంధిత పత్రాలనుసిద్ధం చేశారు. వాటిని సోమవారం జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ చేతులమీదుగా కుక్కపల్లి సీతారామయ్య అందుకున్నారు. నిడమర్రు మండలం బలే చినదుర్గ ఇంటిపట్టాపై పేరుమార్పుకోసం అర్జీ అందించగా సదరు పేరు మార్పుచేస్తూ నిడమర్రు తహశీల్దారు సిద్దం చేసిన పత్రాలను జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చేతులమీదుగా చినదుర్గ అందుకున్నారు. ఈ సందర్బంగా విభిన్న ప్రతిభావంతులసంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ప్రభాకరరావు మాట్లాడుతూ ఇంటర్ పూర్తిచేసిన బధిరులకు ఇతర వేరే బధిరిలతో మాట్లాడుకునేందుకు టచ్ ఫోన్ ను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇది విభిన్న ప్రతిభావంతుల అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. అదే విధంగా బధిరులు, ఆర్ధో దివ్యాంగులు ఐటిఐ, పాలిటెక్నిక్ చదువుకునే విద్యార్ధులను చదువులో ప్రోత్సహించి వారి అభ్యాసం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ల్యాప్ టాప్ లను మంజూరు చేస్తున్నదని చెప్పారు. అటువంటి అర్హులైన వారు అసిస్టెంట్ డైరెక్టర్ విభిన్న ప్రతిభావంతల సంక్షేమ శాఖను సంప్రదించవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ కె. రవికుమార్, ఆర్డిఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జివివి సత్యనారాయణ, సూర్యనారాయణరెడ్డి, జిఎస్ డబ్ల్యూఎస్ నోడల్ ఆఫీసరు రమణ,తదితరులు పాల్గొన్నారు.