గృహ నిర్మాణాల్లో లబ్ధిదారులు ముందుకు రావాలి
1 min read-లబ్ధిదారులకు నోటీసులు అందజేత
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశాల మేరకు ఉగాది లోపు అన్ని గృహాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలంటూ అంతేకాకుండా ఉగాది పండుగ రోజున సామూహిక గృహాల ప్రారంభోత్సవం ఉంటుందని తెలియజేస్తూ గృహ నిర్మాణాలు ముందుకు తీసుకు రావడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ అధికారులపై కలెక్టర్ గతంలో మండిపడిన సంగతి తెలిసిందే అంతేకాదు ఈమధ్యనే కొందరు తహసీల్దార్ల కు మరియు ఎంపీడీఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.లబ్ధిదారులు ఇండ్లను మొదలుపెట్టి బేస్మెంటు తర్వాత వివిధ దశలలో ఉండి నిలిచిపోయిన గృహాల లబ్ధిదారుల ఇండ్లకు అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. గృహ నిర్మాణాలు మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ కూడా నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలని జిల్లా అధికారుల నుండి ఒత్తిడి రావడంతో మండలంలోని వివిధ గ్రామాలలో కడుమూరు,రోళ్లపాడు,జలకనూరు, వీపనగండ్ల,49 బన్నూరు,మాసపేట గ్రామాలలో లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి వారికి అవగాహన కల్పిస్తూ వారికి నోటీసులు అందజేశారు.కడుమూరు గ్రామంలో శుక్రవారం ఉదయం సచివాలయంలో వాలంటీర్లు, సిబ్బందితో సమావేశం నిర్వహించిన సర్పంచ్ తర్వాత ఆయనే స్వయంగా సిబ్బందితో కలిసి గ్రామంలో తిరుగుతూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తూ వారికి నోటీసులను అందజేశారు.ఈకార్యక్రమంలో హౌసింగ్ ఇన్చార్జి ఏఈ రమేష్,పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.