బిజెపి జిల్లా కార్యవర్గ సమావేశం..
1 min read– మోడీ 9 ఏళ్ల పాలనలో బిజెపి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు..
– 2024లో కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వమే..
– ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : మోడీ 9 ఏళ్ల పాలనలో చేసిన అభివృద్ధి, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలా బిజెపి కార్యకర్తలు కృషి చేయాలని మోదీ 9 సంవత్సరాల పాలన ప్రచార కార్యక్రమాల గోదావరి జోనల్ ఇంచార్జి, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ గారపాటి సీతారామాంజనేయ చౌదరి అన్నారు. ఏలూరులోని కోటదిబ్బలో గల చాంబర్ ఆఫ్ మర్చంట్ భవనంలో గురువారం ఏలూరు జిల్లా బిజెపి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బిజెపి ఇచ్చిన పిలుపుమేరకు జూన్ 25 వరకు జిల్లా, అసెంబ్లీ, బూత్ స్థాయిలో నిర్వహించనున్న పలు కార్యక్రమాలపైన చర్చించారు. ఈ సందర్భంగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ మోడీ పాలనలో ప్రజా సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్తపై ఉందని అన్నారు.జిల్లాలో బూత్ స్థాయి నుండి పార్టీ పటిష్టత కోసం ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు. 2024లో కేంద్రంలో మరోసారి బిజెపి ప్రభుత్వమే రాబోతుందని అన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని అన్నారు. అంతకు ముందు ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జిగా రేలంగి శ్రీదేవి, ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ గా గారపాటి సీతారామాంజనేయ చౌదరి నియమితులైన తర్వాత తొలిసారి జిల్లా కార్యవర్గ సమావేశానికి రావడంతో బిజెపి కార్యకర్తలు, నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కురెళ్ల జ్యోతి సుధాకర్ కృష్ణ, రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షురాలు శరణాల మాలతీ రాణి, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మల కిషోర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోరగం వెంకటలక్ష్మి, చౌటపల్లి విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.