రెండు వృషణాలూ ఒకేవైపు!
1 min read
మిలయన్ మందిలో ఒకరికే వచ్చే అత్యంత అరుదైన సమస్య
ఐదేళ్ల బాలుడికి కర్నూలు కిమ్స్ కడల్స్ లో శస్త్రచికిత్స
కర్నూలు, న్యూస్ నేడు : సాధారణంగా అబ్బాయిల్లో ఎవరికైనా వృషణాలు రెండూ రెండువైపులా ఉంటాయి. కానీ, ఉమ్మడి కడప జిల్లాకు చెందిన 5ఏళ్ల బాలుడికి మాత్రం అలా కాకుండా రెండు ఒకవైపు ఉన్నాయి. సమస్యను గుర్తించి.. శస్ర్త చికిత్సను విజయవంతగా పూర్తి చేశామని కర్నూలు కిమ్స్ కడల్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ పీడియాట్రిక్, నియోనాటల్ సర్జన్, పీడియాట్రిక్ యూరాలజిస్ట్ డాక్టర్ వి. సాయిప్రసూన తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.‘‘కడప జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఆటో నడుపుతూ జీవినం సాగిస్తున్నాడు అతడి ఐదేళ్ల కుమారుడికి కుడి వైపు వృషణం బాగా వాపు, నొప్పి ఉండడంతో కర్నూలులోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రికి ఎమర్జెన్సీకి తీసుకొచ్చారు. ఇక్కడ ముందుగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి చూస్తే హెర్నియా అని నివేదిక వచ్చింది. అంటే పేగు స్క్రోటమ్ లోనికి జారిపోవడం వల్ల అది బాగా ఒత్తడంతో పేగు వాపు వచ్చి ఉంటుందని భావించాము. కాగా బాబును పరీక్షించినప్పుడు ఎడమవైపు వృషణం కనిపించలేదు. దాంతో తల్లిదండ్రులను అడిగితే రెండూ ఉన్నాయని చెప్పారు. అప్పుడు బహుశా అది వెనక్కి వెళ్లి ఉంటుందని, తర్వాత మత్తు ఇచ్చినప్పుడు వస్తుందని అనుకున్నాం.
అత్యంత జాగ్రత్తగా శస్ర్త చికిత్స..
పేగులకు సమస్య రాకూడదు అని వెంటనే హెర్నియా శస్త్రచికిత్స చేయడానికి అంతా సిద్ధం చేశాం. తీరా ఓపెన్ చేసి చూస్తే హెర్నియా శాక్ నుండి రెండు వృషణాలు రావడం కనిపించింది. రెండు వైపులా వృషణాలు నుండీ స్పెర్మాటిక్ కార్డ్ అంటే వీర్యకణాలు ఉత్పత్తి అయ్యి, అవి బయటకు రావడానికి ఉపయోగపడే వాస్ డిఫెరెన్స్ మరియు వృషణాలకు రక్తసరఫరా చేసే రక్తనాళాలు అన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయి. వాటి మద్యలో ఆడవాళ్ళ కి సంబంధించిన అపరిపక్వ గర్భాశయం మరియు ట్యూబ్ లాంటి నిర్మాణాలు కూడా కలిసి ఉండటం పరిస్థితి అత్యంత సంక్లిష్టంగా ఉన్నా, అత్యంత జాగ్రత్తగా ఒక వృషణాన్ని, దానికి ఉండే రక్తనాళాలు, వాస్ డిఫెరెన్స్ విడిగా చేసి ఎడమ వృషణం ఎడమ వృషణంలో మరియు కుడి వృషణం కుడి వైపు వృషణం లో పెట్టడం జరిగింది. ప్రస్తుతం పిల్లోడి ఆరోగ్యం బాగా ఉందని ఈ సందర్భంగా డా సాయిప్రసూన వెల్లడించారు.