PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తల్లిపాలు బిడ్డలకు అమృతం…

1 min read

– వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : తల్లిపాలు బిడ్డలకు ఎంతో శ్రేష్టమని, తల్లి ముర్రుపాల వల్ల బిడ్డలకు అమృతమని  వైఎస్ఆర్సిపి టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, సర్పంచ్ సిద్దిగారి వెంకటసుబ్బయ్య, లు అన్నారు, వారు గురువారం చెన్నూరు లోని మైనార్టీ కాలనీ రెండో వార్డు, పదోవ వార్డులలో ప్రపంచ తల్లి పాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొని, గర్భవతులకు, బాలింతలకు వైయస్సార్ సంపూర్ణ పోషణ కిట్లను అందజేశారు, ఆగస్టు 1వ తేది నుండి 7వతేది వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జరుపు కోవడం జరుగుతుందని, అంగన్వాడి కేంద్రంలో గల గర్బవతులకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను గురించి తెలపడం జరుగుతుందని వారు తెలిపారు, అలాగే తల్లిపాలు బిడ్డ ఆరోగ్యానికి శ్రేష్టమని తెలియజేస్తూ పుట్టిన పిల్లలకు 1గంట లోపు వచ్చే పసుపు పచ్చని పాలను బిడ్డ కు ఇవ్వడం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి లభిస్తుందని వారు తెలిపారు, రెండు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా తల్లిపాలను బిడ్డలకు అందించవలసినదిగా వారు సూచించారు,అలాగే బాల్య వివాహాలను నిర్మూలించే దిశగా అడుగులు వేయాలని తెలియజేసేందుకే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు, ప్రతి తల్లి కూడా సాధారణ ఉప్పు శాతం వాడకాన్ని తగ్గించి అయోడైజ్డ్ సాల్ట్ ను ఉపయోగించాలని తెలియజేశారు, అయోడిన్ ఉప్పును గర్భవతులు చిన్నపిల్లలు ఇది తప్పనిసరి అని అన్నారు, ప్రతి ఇంట్లోని కుటుంబ సభ్యులందరిక కోసం చేసే వంటల్లో అయోడిన్ ఉప్పు ఉండేలా చూసుకోవాలని వారు తెలిపారు, గర్భవతులు తీసుకునే ఆహారంలో అయోడిన్ లేకపోతే మందబుద్ధి కలిగిన లేదా వినికిడి లోపం, మూగతనం బండి సమస్యలు ఉన్న పిల్లలు పుట్టవచ్చని కొన్నిసార్లు గర్భస్రావాలకు కూడా కారణం అవుతుందని వారు తెలిపారు . శిశువుగా ఉన్నప్పుడు లేదా చిన్నతనంలో పిల్లలకు సరైన మోతాదులో అయోడిన్ లభించకపోతే అతని శారీరక మానసిక ఎదుగుదల లోపిస్తుందని నేర్చుకునే నైపుణ్యాలు లోపిస్తాయని అన్నారు, పెద్దవాళ్లలో థైరాయిడ్ గ్రంధి తక్కువ స్థాయిలో పనిచేయడం మన తీసుకునే ఆహారంలో సరైన మోతాదులో అయోడిన్ లేనప్పుడు అనేక రకాల రుగ్మతలు అయోడిన్ లోపంతో తలెత్తే వ్యాధులు థైరాయిడ్ వంటి జబ్బుల బారిన పడే అవకాశం ఉందని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లు, ముదిరెడ్డి గీతా, సాదక్ అలీ, కో ఆప్షన్ నెంబర్, వారిష్, సచివాలయ కన్వీనర్, అంగన్వాడి సిబ్బంది, గర్భవతులు బాలింతలు పాల్గొన్నారు.

About Author