NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బురదగుంట హేమంత్ కుమార్

1 min read

మేయర్ అభ్యర్థి బురదగుంట లివిన్ క్రిస్టియన్ విస్తృత ప్రచారం

ఏలూరును గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తీర్చిదిద్దుతాం అని హామీ ఇచిన కాంగ్రెస్ పార్టీ

 హస్తం గుర్తుపై ఓటేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ప్రార్థన

ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు నగరంలోని 34వ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి బురదగుంట హేమంత్ కుమార్, ఏలూరు కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి బురదగుంట లివిన్ క్రిస్టియన్ కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక డివిజన్ డివిజన్ లో  మీడియాతో మాట్లాడుతూ స్థానిక ప్రజలను నేరుగా కలుసుకుని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఏలూరు నగరాన్ని మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ  అనిఅన్నారు.మేయర్ అభ్యర్థి బురదగుంట లివిన్ క్రిస్టియన్ మాట్లాడుతూ, యువ నాయకత్వానికి ప్రజలు ఒక అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే, ఏలూరు నగర అభివృద్ధికి కృషి చేసి చూపిస్తామని తెలిపారు. ఏలూరును నిజమైన గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ, నగర అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.హస్తం గుర్తుపై ఓటేసి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని ఓటర్లను నమస్కరిస్తూ అభ్యర్థించారు.ఈ ప్రచార కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రచారం కొనసాగించారు.వీరితో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *