వ్యాపారం.. ప్యాషన్ కావాలి..!
1 min readరాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి టి.హెచ్ విన్సన్ట్
పల్లెవెలుగు వెబ్, కర్నూలు: యువతకు వ్యాపారం.. ప్యాషన్ మారాలని, అప్పుడే ఎంచుకున్న ప్రాజెక్టు విజయవంతం అవుతుందని రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి టి.హెచ్ విన్సన్ట్ అన్నారు. ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకుని… వ్యాపారం వృద్ధి చేసుకోవడం, మన చుట్టూ ఉన్న వనరులను సద్వినియోగం చేసుకోవడం… తదితర అంశాలను ఆయన నిరుద్యోగ యువతీయువకులకు వివరించారు. కర్నూలు రాయలసీమ యూనివర్శిటీలో మూడు రోజులపాటు నిర్వహించే ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అభివృద్ధి పై అవగాహన సదస్సు బుధవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి టి.హెచ్ విన్సన్ట్ మాట్లాడుతూ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న వివిధ నైపుణ్య శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మాస్టర్ శిక్షకులు, ఇండస్ట్రీ మరియు బ్యాంకు వారు చెప్పే వాటిని జాగ్రత్తగా విని .. భవిష్యత్లో మీరు పెట్టబోయే పరిశ్రమ (వ్యాపారం)కు ఉపయోగించుకోవాలన్నారు. ఏదైనా ప్రణాళికబద్ధంగా… క్రమశిక్షణ, శ్రద్ధ, పట్టుదలతో…లక్ష్యం సాధించే దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి టి.హెచ్ విన్సన్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ప్లేసెమెంట్ అధికారి రామకృష్ణ , మరియు నైపుణ్యాభివృద్ధి సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.