కొత్త గుర్తింపును ఆవిష్కరించిన బటర్ ఫ్లై
1 min read
విశాఖపట్నం, న్యూస్ నేడు : భారతదేశ అత్యంత విశ్వసనీయమైన వంటగది ఉపకరణాల బ్రాండ్లలో ఒకటైన బటర్‌ఫ్లై ఒక కొత్త పేజీని తిరగేస్తోంది. రిఫ్రెష్ చేయబడిన బ్రాండ్ గుర్తింపు, పునరుద్ధరించబడిన ఉద్దేశ్యం, నేటి నిరంతరం మార్పు చెందుతున్న వినియోగదారుని గురించి మరింత స్పష్టమైన అవగాహనతో.ఈ రిఫ్రెష్ కు గుండెకాయలా ఒక చిహ్నం ఉంది, అది కాలానికి అతీతంగా పరివర్తన చెందేది – ఫింగర్ ప్రింట్. అది సీతాకోకచిలుక రెక్కలలో అందంగా విలీనం అవుతుంది. అభివృద్ధి చెందిన ఐకాన్ బ్రాండ్ ప్రధాన నమ్మకాన్ని ప్రతి బింబిస్తుంది: జీవితం మారుతున్నప్పటికీ, ఒకరి అసలైన రూపం అలాగే ఉంటుంది. ఈ వ్యక్తిగత ముద్ర – ఒకరి ఆలో చనా విధానం, వంట చేయడం, సృష్టించడం మరియు జీవించడం – దాన్నేఇప్పుడు బటర్‌ఫ్లై వేడుక చేసుకుంటోంది.బటర్‌ఫ్లై యొక్క ఈ కొత్త శకం జీవితం పట్ల ‘జిల్లెనియల్’ వైఖరి కలిగిన వినియోగదారులతో నేరుగా మాట్లాడుతుంది వాళ్లు- తాము ఎవరో అనే దానిలో పాతుకుపోయి పరివర్తనను స్వీకరించే స్వీయ-అవగాహన కలిగిన వ్యక్తులు. వారికి, మార్పు స్థిరంగా ఉంటుంది – కానీ ప్రామాణికత అనేది చర్చించలేనిదిగా ఉంటుంది. జనాభాను దాటి సైకో గ్రాఫిక్స్‌కు వెళ్లడం ద్వారా వయస్సుపై కాకుండా వైఖరిపై దృష్టి పెట్టడం ఈ బ్రాండ్ లక్ష్యం – ఎందుకంటే జిల్లెనియల్ మనస్తత్వం సంఖ్యలు, సరిహద్దులు లేదా లింగాల ద్వారా నిర్వచించబడదు, కానీ మార్పును ఎలా స్వీకరిస్తారనే దాని ద్వారా నిర్వచించ బడుతుంది.
“40 సంవత్సరాలకు పైగా, బటర్‌ఫ్లై భారతదేశం అంతటా లక్షలాది వంటశాలలలో భాగంగా ఉంది. నేడు, ఇళ్లు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. గుర్తింపులు మరింత స్వీయ-నిర్వచితాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో మా కొత్త గుర్తింపు మనం ఎవరో మాత్రమే కాకుండా – మనం ఎవరి కోసం ఇక్కడ ఉన్నామో కూడా ప్రతిబింబిస్తుంది” అని బటర్‌ఫ్లై చీఫ్ బిజినెస్ ఆఫీసర్ శ్వేతా సాగర్ అన్నారు.
బటర్‌ఫ్లై గాంధీమతి అప్లియెన్సెస్ లిమిటెడ్ గురించి:
‘బటర్‌ఫ్లై’ భారతదేశంలోని వంటగది మరియు చిన్న డొమెస్టిక్ అప్లియెన్సెస్ లో ప్రముఖ 3 బ్రాండ్‌లలో ఒకటి. ఇది దక్షిణాదిలో అధిక వినియోగదారుల రీకాల్‌తో ప్రసిద్ధి చెందిన బ్రాండ్. అందం మరియు ఉత్పత్తి నాణ్యతకు ప్రసిద్ధి చెందింది. వినియోగదారుల అవసరాలను తీర్చడానికి అనుగుణంగా ఉండే వేరియంట్‌లతో ఇది విభిన్న ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది. ఇది 4 ప్రధాన ఉత్పత్తులను కలిగి ఉంది – మిక్సర్ గ్రైండర్లు, ప్రెజర్ కుక్కర్లు, గ్యాస్ స్టవ్, వెట్ గ్రైండర్లు. అంతేగాకుండా చిన్న గృహోపకరణాల పూర్తి సూట్‌తో మద్దతు ఇస్తుంది. ఇది బలమైన బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్‌తో అత్యాధునిక ఇన్-హౌస్ తయారీ సెటప్‌ను కలిగి ఉంది.