గొర్రెల మేకల పెంపకం దారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
1 min read

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మేకల,గొర్రెలకు నట్టల నివారణ మందులు ఉచితంగా పంపిణీ
జూన్ 26వ తేదీ నుండి జూలై 10వ తేదీ వరకు కార్యక్రమాలు
రైతులు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : గొర్రెల మేకల పెంపకం దారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని” దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేశారు.రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మేకలు మరియు గొర్రెలలో నట్టల నివారణ మందుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నాడు పెదవేగి మండలం భోగాపురం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించి గొర్రెలకు నట్టల నివారణ మందులను స్వయంగా అందించారు.ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ మేకలు మరియు గొర్రెలలలో నట్టల నివారణకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాన్ని రైతులు, పెంపకం దారులు ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అని, ఈ కార్యక్రమంలో జీవాలకు ఔషధాలను పూర్తి ఉచితంగా అందించడం జరుగుతుంది అని స్థానిక పశు సంవర్ధక శాఖ అధికారులను సిబ్బందిని కలిసి వారు కేటాయించిన తేదీలలో వారి జీవాలకు ఈ మందును వేసే కార్యక్రమాన్ని తేదీని నిర్ధారించుకునించుకోవాలని సూచించారు. ఈనెల జూన్ 26వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ గోవిందరాజులు,సహా పలువురు సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు.


