PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేబినెట్ ఫైన‌ల్ లిస్ట్ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సీఎం జగన్ కేబినెట్ కూర్పు కోసం కసరత్తు చేస్తున్నారు. కేబినెట్‌లో బీసీ సామాజిక వర్గానికి 9, ఎస్సీలకు 6, ఎస్టీలకు 2, రెడ్డి సామాజికవర్గానికి 3, కాపులకు 3, కమ్మ, ముస్లిం సామాజిక వర్గాల నుంచి ఒకరిని తన కేబినెట్‌లోకి జగన్ తీసుకుంటారని అధికారపార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుత కేబినెట్‌లో కాపు, రెడ్డి సామాజివర్గాల నుంచి నలుగురు మంత్రులుగా ఉన్నారు. కొత్త కేబినెట్‌లో ఈ సామాజికవర్గం నుంచి ఒక్కొక్కరికి ఉద్వాసన పలుకనున్నారు. ఆ రెండు స్థానాలను బీసీ, ఎస్సీ సామాజివర్గాలకు కేటాయిస్తారని చెబుతున్నారు. ముస్లిం కోటా నుంచి ముస్తఫా, హఫీజ్ ఖాన్‌కు చోటు కల్పిస్తారని చెబుతున్నారు. కొత్త కేబినెట్‌లోని శ్రీకాకుళం నుంచి ధర్మాన ప్రసాదరావు, కృష్ణా జిల్లా నుంచి జోగి రమేష్, అనకాపల్లి నుంచి గుడివాడ అమర్‌నాథ్, చిలకలూరిపేట నుంచి రజనీ, సర్వేపల్లి నుంచి కాకాని గోవర్దన్‌రెడ్డిలకు బెర్త్‌లు ఖాయమయ్యాయని వైసీపీ నేతలు చెబుతున్నారు.

                                     

About Author