పురుషులకు మాంసాహారమే మక్కువ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఎక్కువ మంది పురుషులు గత ఆరేళ్లలో మాంసాహారాన్నే అధికంగా తీసుకున్నారని జాతీయ ఆరోగ్య సర్వే గణాంకాలు చెబుతున్నాయి. చేపలు, కోడి మాంసం, లేదా ‘మాంసం’గా పేర్కొనబడిన ఆహార పదార్ధాలను పురుషులే ఎక్కువ ఆసక్తికరంగా తీసుకుంటారని వెల్లడైంది. రెండు దశల్లో 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు. 2015-16 గణాంకాల ప్రకారం 15-49 ఏళ్లలోపు 83.4 శాతం మంది పురుషులు రోజూ, వారానికోసారి, లేదా అప్పుడప్పుడూ మాంసాహారం తింటున్నారని, 2015-16 లో 78.4 శాతం మంది మాంసాహారాన్ని తీసుకునే పురుషులు రికార్డు స్థాయిలో పెరిగారని డేటా వెల్లడించింది.