PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా లూయిస్ బ్రెయిలీ జయంతి వేడుకలు..

1 min read

పాల్గొన్న జెసి బి.లావణ్య వేణి, డి ఆర్ ఓ యం. వెంకటేశ్వర్లు

అర్హులైన దృష్టి లోపం కలిగిన దివ్యాంగులకు ల్యాప్ టాప్ లు అందజేత..

పల్లెవెలుగు వెబ్  ఏలూరు  : దివ్యాంగుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి చెప్పారు. గురువారం  దృష్టి లోపం గల వారికి ప్రత్యేక లిపి ప్రదాత సర్ లూయిస్ బ్రెయిలీ 215వ జయంతి సందర్బంగా స్ధానిక గిరిజన్ భవన్ లో నిర్వహించిన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ లూయిస్‌ బ్రెయిలీ వైకల్యాన్ని జయించి, అనుకున్న లక్ష్యాన్ని సాధించిన మహనీయుడని కొనియాడారు. దివ్యాంగులైన వారు సమాజంలో అందరితో సమానులేనని పేర్కొన్నారు.ఏలూరు జిల్లాలో 34 వేల 276 మంది దివ్యాంగులు ప్రతినెలా రూ. 10.28 కోట్లు పెన్షన్లుగా అందిస్తున్నామన్నారు.  తొలుత లూయిస్ బ్రెయిలీ చింత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని దృష్టి లోపం కలిగిన సుమారు 250 మంది దివ్యాంగులు దాదాపు 250 మంది ఈ వేడుకలకు హాజరయ్యారు.  ఈ సందర్బంగా దృష్టి లోపం కలిగిన దివ్యాంగులచే కేక్ కటింగ్ చేశారు.  ఈ సందర్బంగా  అర్హత కలిగిన దృష్టి లోపం కలిగిన దివ్యాంగులకు ల్యాప్ టాప్ లు జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి , జిల్లా రెవెన్యూ అధికారి యం. వెంకటేశ్వర్లు చేతుల మీదగా ఉచితంగా పంపిణీ చేశారు.  అదే విధంగా లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్బంగా 15 మంది దృష్టి లోపం కలిగిన దివ్యాంగులకు వారి సేవలకు గుర్తింపుగా వారిని సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు.   కార్యక్రమంలో  దివ్యాoగుల సంక్షేమ శాఖ ఆర్.మణీ,దివ్యాంగుల సంక్షేమ అసోసియేషన్ తరపున  జి.డి.వి.ఎస్. వీరభద్ర రావు, గడియన్ కుందేటి జయరాజ్ తదితర సంఘాల వారు ,  స్వచ్చంద సేవా సంస్థల తరపున శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్, పరివర్తన్ స్కూల్ మరియు హెన్రీ డొమినిక్, జి.కరుణోదయ స్కూల్ తదితరులు పాల్గొన్నారు.

About Author