NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా 538వ శ్రీ భక్త కనకదాసు జయంతి

1 min read

హొళగుంద న్యూస్ నేడు: “ఘనంగా 538వ శ్రీ భక్త కనకదాసు జయంతినీ ఆచరించడం జరిగింది” హోళగుంద మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్ లో ఎస్సై దిలీప్ కుమార్ గురజాల  ఆధ్వర్యంలో శ్రీశ్రీశ్రీ భక్త కనకదాసు 538వ జయంతి సందర్భంగా కనకదాసు వారి చిత్రపటానికి పూలమాల వేసి పూజా కార్యక్రమం  నిర్వహించడం జరిగింది. ఎస్​ఐ,  దిలీప్ కుమార్ గురజాల అండ్​  కురువ సంఘం నాయకులు మాట్లాడుతూ సామాజిక తత్వవేత్తగా, స్వర కర్తగా, తన కిర్తలను, రచనాలతో, సమాజంలో అసమానతులు, కుల వ్యవస్థ పై ప్రజల్లో చైతన్య పరిచిన వ్యక్తి శ్రీ భక్త కనకదాసు వారు అని, తన శ్రేష్టమైన భక్తితో ఉడిపి శ్రీకృష్ణ పరమాత్ముడు సైతం తన వైపు తిప్పుకున్న మహనీయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దిలీప్ కుమార్ గురజాల, కానిస్టేబుల్ చంద్ర  మాదాసి మాదారి కురువ సంఘం మండల అధ్యక్షులు గర్జ్జప్ప , సంఘం నాయకులు సిద్ధప్ప, మంజునాథ్ గౌడ్, నేరగాల్ల, చిన్యట ఆంజనేయ, గదిలింగ, మరియు తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.

About Author