ముగిసిన సెల్ఫోన్ డి. అడిక్షన్ శిక్షణ..
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: విద్యార్థుల్లో సృజనాత్మకత వెలికి తీసేందుకు జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుందని జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు బి. సురేష్ కుమార్ అన్నారు. గత రెండు రోజులుగా బిర్లా కాంపౌండ్ లోని విబిఆర్ కాన్ఫరెన్స్ హాల్ నందు జరుగుతున్న రెండు రోజుల సెల్ఫోన్ డి అడిక్షన్ శిక్షణ ఆదివారం ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పిల్లల్లో సెల్ఫోన్ అడిక్షన్ క్రితంగా పెరిగిపోతుందని అందుకే వారికి సెల్ఫోన్ అడిక్షన్ నుంచి దృష్టి మరణించేందుకు వారిలోని సృజనాత్మకతను వెలుగు తీసేందుకు ఈ రెండు రోజుల శిక్షణ కార్యక్రమం బాగా ఉపయోగపడిందన్నారు. ప్రముఖ మేథ మ్యాజిక్స్ స్కిల్స్ అకాడమీ డైరెక్టర్ శ్రీ చంద్రయ్య ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని పిల్లలు రోజంతా సెల్ఫోన్ ఉపయోగించకుండా ప్రతి రోజు మనం ఉపయోగిస్తున్న చిన్న చిన్న వస్తువులతో ఎలా ప్రయోగాలు చేయవచ్చు అని పిల్లలతో చేయిస్తూ వారిని ఉత్సాహపరిచారు. పిల్లల సైతం ఎంతో ఉత్సాహంగా ఆ ప్రయోగాల్లో పాల్గొని తాము చేస్తూ రెండు రోజులు ఎంత ఉత్సాహంగా గడిపారని ఆయన తెలిపారు. జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ వి. బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ పిల్లలు సెల్ఫోన్ కు అడిక్షన్ కావడం ద్వారా కంటి, మెడ, వెన్నెముక సమస్యలు రాబోయే కాలంలో అధికంగా వస్తాయని పిల్లలలో సృజనాత్మకత తగ్గిపోతుంది అని పిల్లలు స్వతహాగా ఎది కగెందుకు ఇబ్బందులు ఏర్పడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక నాయకులు భాషా, ప్రతాప్ రెడ్డి రిటైర్డ్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ రమేష్, , కొండమ్మ ధనుంజయ్, శ్రీరాములు, వీరేష్ యోహాన్ తదితరులు పాల్గొన్నారు.