కేంద్రం నిర్లక్ష్యం వల్లే చనిపోయారు : ప్రియాంక గాంధీ
1 min readపల్లెవెలుగు వెబ్ : కరోన రెండో దశలో ఆక్సిజన్ కొరతతో దేశంలో వైరస్ బాధితులు చనిపోలేదంటూ కేంద్రం చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆక్సిజన్ అందక కాదు.. దాన్ని అందజేయడంలో కేంద్రం నిర్లక్ష్యం కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారని ఆమె ఆరోపించారు. వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో కేంద్రం ఆక్సిజన్ ఎగుమతిని 700 శాతం పెంచిందన్నారు. ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా కోసం కేంద్రం రవాణ సౌకర్యాలు కల్పించకపోవడం కారణంగానే మరణాలు సంభవించాయన్నారు. రోగులకు ఆక్సిజన్ అందించడానికి కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పే దిశగా కేంద్రం చర్యలు తీసుకోలేదని అన్నారు.