చంద్రబాబు కక్షసాధింపు చర్యలు వెర్రితలలు వేస్తున్నాయి..!
1 min read
వైఎస్ఆర్సిపి నంద్యాల జిల్లా అధ్యక్షులు మరియు పాణ్యం మాజి ఎమ్మెల్యే శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి కార్యాలయం నందు మీడియా సమావేశం నిర్వహించారు…!!!!
అనంతరం మీడియాతో మాట్లాడిన శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి …!!!
మాజీ మంత్రి విడదల రజినిపై పోలీసుల దౌర్జన్యం..!!!
కర్నూలు, న్యూస్ నేడు: చంద్రబాబు కక్షసాధింపు చర్యలు వెర్రితలలు వేస్తున్నాయి. దేశంలో యుద్ధవాతావరణం నెలకొని ఉంటే చంద్రబాబు మాత్రం రాష్ట్రంలో అరాచకాలు చేస్తున్నాడు. ఓవైపు దేశంలోని ప్రజలంతా ఉగ్రవాదులను మట్టుబెట్టాలన్న సంకల్పంతో రక్షణ బలగాలకు సంఘీభావం తెలిపితే, ఈరాష్ట్రంలో చంద్రబాబు, ఇక్కడ ప్రతిపక్ష పార్టీలను ఏరకంగా కట్టడి చేయాలి, ఎలా కక్షలు తీర్చుకోవాలని అన్నదానిపై దృష్టిపెట్టాడు. అందుకే అంటున్నాం.. దేశమంతా యుద్ధంలో, చంద్రబాబు రాజకీయ కక్షల్లో అని,చంద్రబాబునాయుడుగారు లాంటి రాజకీయనాయకుడ్ని ఎక్కడా చూసి ఉండం. లేని లిక్కర్ స్కాంను సృష్టించి, అబద్ధాలను ఆరోపణలుగా మార్చి దానిచుట్టూ కక్ష తీర్చుకునే క్రమంలో ఓవైపు జగన్‌గారి చుట్టూ ఉన్న వ్యక్తులను టార్గెట్ చేయడమే కాకుండా, మరోవైపు వైయస్సార్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కక్షలు తీర్చుకునే కార్యక్రమాన్ని చంద్రబాబు చేస్తున్నాడు. ఇవాళ అధికారంలో ఉన్నాడు కాబట్టి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి కాబట్టి… కొన్నాళ్లపాటు ఆటలు చెల్లుతాయి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని గుర్తు పెట్టుకోవాలి. కాలం మారినప్పుడు, ప్లేటు తిరబడినప్పుడు ఈ పద్ధతులే రేపు కూడా అనుసరిస్తారు. అప్పుడు తప్పనిసరిగా చట్టం ముందు నిలబడి తగిన మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. దేశం ఒకవైపు యుద్ధవాతావరణం ఉంటే, అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు రక్షణ బలగాలకు సంఘీభావంగా ఉండి, ఎలాంటి పరిస్థితినైనా ఎదర్కోవడానికి సమాయత్తమవుతుంటే.. చంద్రబాబు మాత్రం.. ఇక్కడ రాజకీయ కక్షలు తీర్చుకునే పనిలో మునిగిపోయాడు. కేంద్రానికి, రక్షణ బలగాలకు ఎలా మద్దతుగా నిలవాలిన అన్న ఆలోచనలు మాని కుళ్లు, కుతంత్రాలతో కాలం గడుపుతున్నాడు. ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచింది. కానీ ప్రజలకు ఏమీ చేయలేదు. యువతకు ఏమీ చేయలేదు. మహిళలకు ఏమీ చేయలేదు. రైతులకు ఏమీ చేయలేదు. ఉద్యోగులకు ఏమీ చేయలేదు. కాని, ఈ ఏడాది అంతా కక్షలు, దాడులు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, తప్పుడు నిర్బంధాలకు పాల్పడ్డారు. చంద్రబాబు మొత్తం, తన బలాన్ని, తన బలగాన్ని దుర్మార్గాలకే వాడుకున్నార. తీవ్రంగా అధికార దుర్వినియోగం చేశారు. చట్టాన్ని, న్యాయ ప్రక్రియను, కోర్టులను అపహాస్యం చేశారు.ఇవాళ కాకపోయినా, రేపైనా నిజాలేంటో బటయపడతాయి. కాని, చంద్రబాబు చేసిన దుర్మార్గాలను మాత్రం ప్రజలు క్షమించరు. ప్రజలే ఈ నియంతలుగా మారిన భరతం పడతారు. కక్షలు తీర్చుకోవడంలో చంద్రబాబు అన్ని లైన్లు క్రాస్ చేశాడు. దీనికోసం పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్న తీరు మొత్తం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. మాజీమంత్రి విడదల రజని పట్ల నిన్న చిలకలూరిపేట సీఐ వ్యవహరించిన తీరును రాష్ట్రం, దేశం మొత్తం చూసింది. పల్నాడు జిల్లా నాందెడ్ల మండలం మానుకొండ వారి పాలెం ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మాజీ మంత్రి విడదల రజిని పై పోలీసులు దౌర్జన్యంకు పాల్పడ్డారు. వైయస్ఆర్సీపీకి చెందిన శ్రీకాంత్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అనుబంధం విభాగాలు అధ్యక్షులు, వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.