NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నేడు కలెక్టరేట్లో “ప్రజా విజ్ఞప్తుల స్వీకరణ”

1 min read

ఉ.9:30 గం.ల నుండి మ.12:30 గం. వరకే పిజిఆర్ఎస్

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా, ఐ.ఎ.ఎస్

నంద్యాల,  న్యూస్ ​నేడు: ఈ నెల 12వ తేదీ సోమవారం నంద్యాల పట్టణం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో  “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుండి విజ్ఞప్తులు స్వీకరించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ శ్రీమతి రాజకుమారి గణియా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.ప్రభుత్వ సూచనల మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే ప్రజలు ఎవ్వరూ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో  పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని ఉ.9:30 గం.లకు ప్రారంభించి మ.12:30 గం.లలోగా పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే ”పబ్లిక్‌ గ్రివియన్స్‌ రెడ్రెస్సల్‌ సిస్టం” కార్యక్రమానికి ఈ నెల 12వ తేదీ ఉదయం 9-30 గంటలకు జిల్లాధికారులందరూ హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.అలాగే జిల్లా కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయిలో కూడ పిజిఆర్ఎస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.  

About Author