సీఎం మనసు మార్చు ఓ..దేవా
1 min readపల్లె వెలుగు వెబ్ : శతాబ్దాల చరిత్ర కల కడప జిల్లా పేరును యధాతథంగా ప్రభుత్వ గెజిట్ లొ ఉండేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మనసు మార్చి కడప ఖ్యాతి చెరగకుండ చూడాలని తెలుగు దేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ కోరారు. శుక్రవారం నాడు ఉదయం దేవుని కడప శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి సమర్పించిన వినతి పత్రంలో పేర్కొన్నారు. దేవుని కడపకు నడుచుకుంటూ ర్యాలీగా వచ్చిన సాయినాథ్ శర్మ మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లోనే కడప పేరుకు విశేష ప్రాధాన్యత ఉంధన్నారు. కడప పేరు తీసివేసి వైఎస్సార్ జిల్లా గా మార్పు చేయడానికి ముఖ్యమంత్రి జిల్లా వాసులు అభిప్రాయం తీసుకున్నారా అని ప్రశ్నించారు. కేవలం తన పార్టీ పేరును జిల్లా ప్రజలు ఎప్పుడు స్మరించేలా ఉండడానికి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి కడప పేరును తొలగించి వైఎస్సార్ జిల్లాగా గెజిట్ విడుదల చేశారన్నారు. కడప పేరు తొలగించడం వెనుక పెద్ద కుట్రనే జరిగిందన్నారు. కడప జిల్లా ప్రజలు పెట్టిన రాజకీయ బిక్షతో రాష్ట్ర పాలనా పగ్గాలు వైఎస్ కుటుంబం చేపట్టిందన్నారు. కడప లేకపోతే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కి గుర్తింపే లేదన్నారు. తనకు తన కుటుంబానికి బంగారు భవిష్యత్ ఇచ్చిన కడప పేరును తొలగించడం మాతృభూమికి ద్రోహం చేసినట్లేనని ఆయన ఆగ్రహం చెందారు. జిల్లా పేరును కొనసాగించాలని జిల్లా ప్రజలు, నాయకులు ఎంతగా ఆందోళనలు చేసిన ముఖ్యమంత్రి మనసు మారలేదన్నారు. కనీసం దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి అయినా జిల్లా ప్రజలపట్ల కనికరం, కరుణ జాలి లేని ముఖ్యమంత్రి మనసు మార్చాలని కడప పేరు యదాతథంగా ఉండేలా చూడాలని దేవుడు మార్చాలని కోరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జింకా శ్రీను, కడప పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ ఇటుకులపాటి జనార్ధన్, తెలుగుదేశం నాయకులు సుధాకర్, నాగరాజ ఆచారి, విజయ్, సుబ్రహ్మణ్యం, నంద్యాల మహేష్ తాడిగొట్ల వాసు తదితరుల పాల్గొన్నారు.