పాఠశాలల సముదాయాల సమావేశాల సమయం వేళల్లో మార్పులు చేయాలి : ఆప్తా
1 min read
పల్లెవెలుగు వెబ్ అమరావతి: పాఠశాల సముదాయ సమావేశాలకు హాజరు అయ్యే ఉపాధ్యాయులు ఉదయం 11:45 నిమిషాల వరకు పనిచేస్తున్న పాఠశాలలో తరగతులు నిర్వహించి, తర్వాత దాదాపు 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్లస్టర్ పాఠశాలలకు ఒక గంటలో చేరుకోవడం సాధ్యమేనా ? కొన్ని సందర్భాలలో ఉపాధ్యాయులు రెండు వాహనాలు మారి గమ్యస్థానం చేరుకోవాలి. రెండు వాహనాలు మారి క్లస్టర్ సమావేశాలకు హాజరయ్యే ఉపాధ్యాయులకు గంటలో రెండు వాహనాలు అందుబాటులో ఉంటాయా. పంచాయతీ వారిగా క్లస్టర్లు ఏర్పాటు చేయడం వల్ల కొన్ని పాఠశాలలు క్లస్టర్ కి చేరుకోవడానికి దూరంగా ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉపాధ్యాయులు మధ్యాహ్న భోజనం చేయాలి. మరి భోజనం ఎప్పుడు చేయాలి. కనీసం భోజనానికి అరగంట సమయం కేటాయించకపోతే ఎలా?ఈ తొందరలో ఉపాధ్యాయులకు ప్రమాదాలు జరిగే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా పాఠశాలల పనివేలలు సాయంత్రం నాలుగు గంటల వరకే కావున ఆ సమయానికే సమావేశాలు ముగింపు చేయాలని, ఉన్నతాధికారులు ఆలోచించి తగు నిర్ణయం తీసుకుని క్లస్టర్ సమావేశాలు సౌకర్యవంతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేయాలని , క్లస్టర్ సమావేశంలు వున్న రోజు పాఠశాల కు పూర్తి స్థాయి లో శెలవు ప్రకటించి తదనుగుణంగా సమావేశాల నిర్వహిస్తే బాగుంటుందని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కి ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ జి ఎస్ గణపతి రావు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రకాశ్ రావు లేఖద్వారా కోరారు.