NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హోటల్లో గందరగోళం సృష్టించారు !

1 min read

పల్లెవెలుగువెబ్ : జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంలో చోటుచేసుకున్న ఘటనలపై నేడు మంగళగిరిలో మీడియా సమావేశం నిర్వహించారు. వైసీపీ నేతల భూకబ్జాలు బయటపడతాయనే తమ జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. విశాఖలో పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుపైనా పవన్ స్పందించారు. తాము డ్యూటీ చేస్తున్నామని పోలీసులు చెప్పారని, అందుకు తనకేమీ అభ్యంతరంలేదని చెప్పానని, జనసేన చేస్తున్నది పోలీసులతో యుద్ధం కాదని స్పష్టం చేశానని వివరించారు. “ఇక నేను బస చేసిన హోటల్ లో అర్ధరాత్రి నుంచి వేకువజామున నాలుగున్నర, ఐదు గంటల వరకు ఒక ఫ్లోర్ మొత్తం గందరగోళం సృష్టించారు. అరుపులు, కేకలు, బాదడాలు, చప్పుళ్లతో భయానక వాతావరణం సృష్టించారు. పాపం, విదేశాల నుంచి వచ్చినవారు కూడా నోవోటెల్ హోటల్ లో ఉన్నారు. టూరిజం పరంగా ఎంత తప్పుడు సంకేతాలు వెళతాయి? వైసీపీ ప్రభుత్వానికి ఇది సిగ్గుచేటు. గదిలో ఉన్న ఫ్యామిలీలను కూడా తనిఖీలు చేశారు. చిన్న పిల్లలు పడుకుని ఉన్నారని చెప్పినా వినిపించుకోకుండా, చూడాల్సిందేనంటూ సోదాలు జరిపారు. మీరు ఎవరిని సంతృప్తి పరచడానికి ఇలా చేస్తున్నారు సార్? అని పోలీసులను అడిగాను. దాంతో మళ్లీ మౌనం! వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. మేం దీన్ని రాజకీయపరంగా ఎదుర్కొనాల్సిందే అని వారికి చెప్పాను“ అని పవన్ అన్నారు.

          

About Author