ఈ ఆహారంతో అంగస్తంభనకు చెక్ పెట్టొచ్చు !
1 min readపల్లెవెలుగు వెబ్ : మధ్యధరా సముద్రం చుట్టుపక్కల దేశాల్లో తీసుకునే ఆహారంతో అంగస్తంభన సమస్యకు చెక్ పెట్టొచ్చని యూనివర్శిటీ ఆఫ్ ఏథెన్స్ అధ్యయనంలో తేలింది. రోజూవారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పొట్టుతో కూడిన ధాన్యాలు, గింజపప్పులు, మసాలాలు, చేపలు, రోయ్యల వంటి సముద్ర ఆహారం, ఆలివ్ నూనె ప్రధానంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలు, పాలపదార్థాలు, గుడ్డు, చీజ్ మితంగా ఉండేలా చూసుకోవాలని.. మాంసం అరుదుగా తినాలని సూచిస్తున్నారు. మధ్యవయసులో అధిక రక్తపోటు, అంగస్తంభన సమస్య ఉన్న వారికి ఈ ఆహారం బాగా ఉపయోగపడుతుండటం విశేషం. ఈ ఆహార పద్దతి రక్త నాళాల పనితీరు మెరుగుపరచటం, టెస్టోస్టిరాన్ తగ్గకుండా చూడటం ద్వార మేలు చేస్తోందని పరిశోధకులు భావిస్తున్నారు.