జోనల్ వైసిపి పంచాయతీ రాజ్ వింగ్ ఇన్చార్జిగా చీర్ల సురేష్ యాదవ్
1 min readపల్లెవెలుగు వెబ్ చెన్నూరు: వైయస్సార్సీపి అనుబంధం విభాగం జోనల్ పంచాయతీ రాజ్ ఇన్చార్జిను వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియమించినట్లు ఎంపీపీ సురేష్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరు సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి నెల్లూరు కడప జోనల్ ఇన్చార్జిగా నియమించినట్లు వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసినట్లు ఆయన తెలియజేశారు. తనను నమ్మి తనకు ఈ బాధ్యతలను అప్పగించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కాగా తన పట్ల వారికి ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పని చేస్తానని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 26 జిల్లాలను ఎనిమిది జోన్లుగా చేసి ఆయా అనుబంధ విభాగాలు ఇన్చార్జిలను నియమించడం జరిగిందని ఆయన తెలిపారు. ఇందులో వైఎస్ఆర్సిపి యువత, రైతు విద్యార్థి మహిళ, బీసీ సెల్, ఎస్సీ సెల్ టి యు సి పంచాయతీరాజ్, దివ్యాంగులు, సేవాదళ్, డాక్టర్స్, వాణిజ్య, సాంస్కృతిక, పబ్లిసిటీ, గ్రీన్ సెల్, చేనేత విభాగాలకు జోనల్ ఇన్చార్జిలను నియమించినట్లు ఆయన తెలిపారు. ఇందులో తనకు పంచాయతీ రాజ్ వింగ్ జోనల్ ఇన్చార్జిగా తిరుపతి నెల్లూరు కడప కు ఇవ్వడం జరిగిందని అన్నారు నన్ను నమ్మి నన్ను పంచాయతీరాజ్ వింగ్ జోనల్ ఇన్చార్జిగా నియమించిన జగన్మోహన్ రెడ్డికి, కమలాపురం శాసనసభ్యులు పోచంపేట్ రవీంద్రనాథ్ రెడ్డి కి, డిప్యూటీ సీఎం అంజద్ భాషా కి, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు కే సురేష్ బాబుకు అదే విధంగా వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్జీఎన్ భాస్కర్ రెడ్డి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.