NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహయనిధి పథకం

1 min read

ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపి ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వం లక్ష్యం

మహిళల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించిన కూటమి ప్రభుత్వం

మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి

మంత్రాలయం, న్యూస్​ నేడు   : నిరుపేదలకు వరం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం అని  మంత్రాలయం టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని మాధవరం గ్రామంలో టిడిపి కార్యాలయంలో నియోజకవర్గంలో 28 మంది బాధితులకు రూ 17లక్షల 22 వేల 920 ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం హయంలో ప్రజల జీవనాలు అస్తవ్యస్త చేసి గాలికి వదిలేసిన పార్టీ గాలోకి కలిసిపోయిందని ఎద్దేవా చేశారు.  పేదల జీవనలను మెరుగుపరిచి సమాజములో స్వేచ్చా జీవనలకు పునాదులు వేసి సంతోషంగా జీవించాలని ఆక్షాంశించారు.  ఆరోగ్య దృష్ట్యా హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నా తరువాత కుటుంబాల జీవన ఆధారంపై భారం పడకూడదని హాస్పిటల్  ఖర్చులకు తిరిగి ఇచ్చి పేదల జీవనాలకు భరోసా కల్పిస్తూ,అండగా ఉంటున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ మంచి చేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ,ఇది మంచి ప్రభుత్వం అని చెబుతూ,ఒక్కొకటిగా అన్ని పథకాలు నెరవేస్తుందని తెలిపారు. అలాగే కూటమి ప్రభుత్వం లో మహిళలకు ప్రత్యేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. వారి కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం జరిగిందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎంతో కృషి చేయడం జరిగిందని తెలిపారు. కొంత మంది వైకాపా నాయకులు లేని పోని ఆరోపణలు చేస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి జీర్ణుంచులేక తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. అనంతరం బాధితులు ముఖ్యమంత్రి చంద్రబాబు కు ధన్యవాదములు తెలిపి టిడిపి ఇన్చార్జ్ మాధవరం రాఘవేంద్ర రెడ్డి పూలమాలలు వేసి శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమములో టిడిపి నాయకులు మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి,రామకృష్ణ రెడ్డి, నరవ రమాకాంత్ రెడ్డి, కౌతాలం ఉలిగయ్య, పల్లెపాడు రామిరెడ్డి, బసలదొడ్డి ఈరన్న,ఆడివప్ప గౌడ్,వెంకటాపతి రాజు, టిప్పు సుల్తాన్, నాగేశ్వరరావు,జ్ఞనేశ్,మల్లికార్జున, ఏసోభు, వీరేశ్ గౌడ్, డా”రాజనందన్, మాలపల్లి లక్ష్మయ్య,గోపాల్,అయ్యన్న, చిదానంద, సోషల్ మీడియా కోఆర్డినేటర్ రామకృష్ణ, వంశి తెలుగు యువత రాకేష్ రెడ్డి,నరసన్న నాలుగు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *