NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బాల్యవి వాహాలు నిర్ములించి, చేసేవారిపై కేసులు నమోదు చేయాలి

1 min read

బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉన్న దేవాలయాలు, తదితర ప్రదేశాల వద్ద గట్టి నిఘా ఉంచాలి

బాలికా విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి

బాల్య వివాహాలు నిర్మూలనపై అధికారులతో సమీక్షించి, గోడపత్రికలను ఆవిష్కరించిన  జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి

  ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో శుక్రవారం బాల్య వివాహాలు నిర్మూలనపై తీసుకోవలసిన చర్యలపై అధికారులతో సమీక్షించి,  గోడపత్రికలను జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్ట విరుద్ధమని, నిర్మూలనకు సమాజం అంతా కలిసికట్టుగా పనిచేయ్యవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాల్యవివాహాలు బాలికలు ఆరోగ్యం, విద్య మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. బాలికలకు విద్య అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.  మహిళలు పురుషులతో దేంట్లోనూ తక్కువ కాదని,  ఉన్నత విద్యావంతురాలైన తరవాత తన కాళ్లపై తాను నిలబడిన తరవాత వివాహం చేయాలన్నారు.   18 సంవత్సరాలు లోపు బాలికలకు, 21 సంవత్సరాలు లోపు బాలురకు వివాహం చేయడం చట్ట విరుద్ధమని, అలాంటి ఘటనలు గమనించిన వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ గోడపత్రికలు ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు అవగాహన పెంపొందించి, బాల్యవివాహాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని  తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, వారి భవిష్యత్తును సురక్షితంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.          రాబోవు అక్షయ తృతీయ నాడు శుభకార్యాలకు చాలా శుభం జరుగునని మంచి లగ్నమని బాల్యవివాహాలు చేయడానికి అవకాశం ఎక్కువగా ఉందని వాటిని అరికట్టడానికి సంబంధిత శాఖలందరూ సమన్వయంతో నిశితంగా పరిశీలించి నిఘా ఉంచాలన్నారు.  ప్రత్యేకించి దేవాలయాల వద్ద దేవాలయాలుకి అనుబంధంగా ఉన్న కళ్యాణ మండపాలలోనూ ఏ విధమైన బాల్య వివాహము జరగకుండా చూడాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ శ్రీమతి వెట్రీ సెల్వీ   ఆదేశించారు.    ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ  పి శారద, డిఆర్డిఏ పీడీ  విజయలక్ష్మి ,డిఇఓ వెంకట లక్ష్మమ్మ ,డీసీపీఓ సిహెచ్. సూర్యచక్రవేణి,ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్   సిఐ యం.సుబ్బారావు,సిడిపిఓ లు  పద్మావతి, రాజశేఖర్, దీప్తి   నోడల్ ఆఫీసర్  తులసి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ మరియు ద్వారకాతిరుమల అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్,  బ్రాహ్మణ ఐక్యవేదిక సభ్యులు మైలవరపు గురుశర్మ ,వెంకటేశ్వర శాస్త్రి మరియు మ్యారేజ్ పెర్ఫార్మెన్స్ లైసెన్స్ హోల్డర్స్  నేతల రమేష్ బాబు , మ్యారేజ్ నిర్వహించు పాస్టర్స్, కాజాస్ – ముస్లిం మత పెద్దలు, క్రాఫ్ స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ వినోద్, డిసిపియు సిబ్బంది జయలక్ష్మి , రాజు, బాలస్వామి, రాజేష్, రాజకుమార్,మాధవి మరియు ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author