సరిహద్దుల్లో చైనా కదలికలు పెరిగాయి !
1 min readపల్లెవెలుగు వెబ్: భారత సరిహద్దుల్లో చైనా దళాల గస్తీ పెరిగిందని ఈస్టర్న్ ఆర్మీ కమాండర్ లెప్టినెంట్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. దీంతో పాటు చైనా దళాలు వార్షిక యుద్ధ విన్యాసాలు చేస్తున్నాయని చెప్పారు. సరిహద్దుల్లో చైనా మౌలిక వసతుల కల్పన వేగవంతం చేసిందని, అక్కడి నిర్మాణాలు ఘర్షణలకు దారితీస్తున్నాయని అన్నారు. యుద్ధ విన్యాసాల్లో కీలక పరికరాలు ఉపయోగిస్తున్నారని, గత ఏడాది నుంచి పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈస్టర్న్ కమాండ్ సన్నద్ధంగా ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.