చిరు, పవన్ కంటే ఫాలోయింగ్ నాకే ఎక్కువేమో !
1 min readపల్లెవెలుగు వెబ్ : రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి కుట్రపన్ని తాను ఓ మీడియా సంస్థ నుంచి మిలియన్ యూరోలు తీసుకున్నట్టు ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం పై ఎంపీ రఘురామకృష్ణ రాజు స్పందించారు. డబ్బులు బదిలీ అలవాటు ఉన్నవారు యూరోల్లో బదిలీ చేశారేమో, అందుకే అఫిడవిట్ లో ఆ పద ప్రయోగం చేశారని రఘురామ ఎద్దేవా చేశారు. ‘ఇప్పటి వరకు సినిమాల్లో అత్యధిక పారితోషికం చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు ఇస్తారని విన్నాం.. వారి కంటే నాకే ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్టు, అందుకే నాకు ఇంత పారితోషికం ఇచ్చారని’ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రోత్సాహంతోనే రాష్ట్ర ప్రభుత్వం తన మీద అఫిడవిట్ దాఖలు చేసిందని చెప్పారు. తనకు ఎదురు డబ్బు ఇచ్చి తన ఇంటర్వ్యూలు ప్రసారం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొందని, ఎందుకు ప్రభుత్వం ఇంతలా దిగజారి ప్రవర్తిస్తోందో తెలిదన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్టు వదంతులు పుట్టిస్తున్నారని, తాను రాజీనామా చేయడం ఒక కల అని అన్నారు. తాను షెడ్యూల్ 10లోని నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పారు.