పకడ్భందీగా పదోతరగతి పబ్లిక్ పరీక్షలు
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: జిల్లాకలెక్టర్ ఆధ్వర్యంలో పకడ్భంధీగా ఈనెల 17నుండి31వరకు పదవతరగతి పబ్లిక్ పరీక్షలు జరుగనున్న నేపథ్యంలో అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి.జిల్లా వ్యాప్తంగా 517 పాఠశాలల నుండి విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.పరీక్షల నిర్వహణకు 172 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఇందులో జిల్లా వ్యాప్తంగా 40,776 మంది విద్యార్థులు హాజరు కానున్నారన్నారు. ఇందులో 31,410 రెగ్యులర్, ప్రయివేటు 7038, అలాగే ఓపెన్ టెంత్ 2328 విద్యార్థులు రాయనున్నారు. అన్నీ పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు సెక్షన్ 163 బీయన్‌యస్‌యస్ అమలు చేయనున్నారన్నారు.ఇప్పటికే 172 చీఫ్ సూపరింటెండెంట్లు, 172 డిపార్ట్‌మెంటల్ అధికారులు, 1840 మంది ఇన్విజిలేటర్లు 7 ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, 12 మంది రూట్ అధికారులు, మరొక 12 మంది అదనపు రూట్ అధికారులు, 11 మంది సీ `సెంటర్ కస్టోడియన్ల నియామకం పూర్తిఅయ్యింది.పరీక్షకేంద్రాల సమీపంలో అన్ని జిరాక్స్ సెంటర్లు మూసివేసేందుకు ఆదేశాలు జారీ జేయడం జరిగింది. 8 సమస్యాత్మక కేంద్రాలున్నాయి. అవి జెడ్పీహెచ్‌యస్ గార్గేయపురం, జెడ్పీహెచ్‌యస్ వసంతనగర్, జెడ్పీహెచ్‌యస్ ఉలిందకొండ, ఏపియంయస్ సి.బెళగల్, జెడ్పీహెచ్‌యస్ సీ`బెళగల్, జెడ్పీహెచ్‌యస్ దేవనకొండ, జెడ్పీహెచ్‌యస్ ఆస్పరి ఏ సెంటర్, జెడ్పీహెచ్‌యస్ ఆస్పరి బీ సెంటర్లు ఉన్నాయి.వీటిపై ప్రత్యేకదృష్టి సారిస్తున్నాము. 6 కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని అవి గార్గేయపురం, రామళ్ళకోట, ఉల్చాల, ఆస్పరి ఏ మరియు బి సెంటర్ ఏపియంయస్ గాజులదిన్నెలలో ఏర్పాటు చేశాము. గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం ఏపియస్‌ఆర్టీసి ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని దాన్ని విద్యార్థులు వినియోగించుకోవాలి.పరీక్షాకేంద్రాలలో 24 గంటల విద్యుత్ మరియు తాగునీటి వసతి ఉంటుంది. ప్రతి పరీక్షాకేంద్రంలో వైద్య సిబ్బంది నియామకం, అందుబాటులో మెడికల్ కిట్లు ఓఆర్‌యస్ పాకెట్లు ఉంటాయి.పరీక్షాకేంద్రాల వారీగా ఇన్విజిలేటర్ల నియామకం పూర్తి అయ్యింది. విధి నిర్వహణలో ఏ చిన్న ఘటన జరిగినా సస్పెన్షన్ వేటు తప్పదన్నారు. పోలీస్‌స్టేషనకు గట్టిబందోబస్తు మధ్య ప్రశ్నాపత్రాలు తరలించామన్నారు.పరీక్షల సందర్భంగా ప్రతిరోజూ ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరుగుతుంది.ఎటువంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టడం జరిగింది.